English | Telugu
వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన కిరణ్ అబ్బవరం కొత్త చిత్రం!
Updated : Mar 9, 2023
యువ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే 'వినరో భాగ్యము విష్ణుకథ'తో పలకరించిన కిరణ్ త్వరలో 'మీటర్' సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. అలాగే 'రూల్స్ రంజన్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ఇప్పుడు తాజాగా మరో చిత్రాన్ని ప్రారంభించాడు.
కిరణ్ కెరీర్ లో 9వ సినిమాగా తెరకెక్కనున్న చిత్రం గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. గతంలో 'జంబ లకిడి పంబ'(2018) సినిమాని నిర్మించిన శివమ్ సెల్యులాయిడ్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.2 గా రూపొందనున్న ఈ చిత్రానికి విశ్వ కరుణ్ దర్శకుడు. జోజో జోస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. గురువారం ఉదయం దర్శకుడు వీవీ వినాయక్, నిర్మాతలు సురేష్ బాబు, ఏఎం రత్నం వంటి ప్రముఖుల సమక్షంలో ఈ మూవీ ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు షాట్ కి వినాయక్ క్లాప్ కొత్తగా, సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు.