English | Telugu
రాజమౌళి వల్లే రాశి ఖన్నాకు ఆ ఆఫర్ వచ్చింది!
Updated : Mar 9, 2023
'ఊహలు గుసగుసలాడే' సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన ముద్దుగుమ్మ రాశి ఖన్నా మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. వరుస సినిమాలలో నటిస్తూ తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే రాశి ఖన్నాకి 'ఊహలు గుసగుసలాడే' సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం రావడానికి ఓ రకంగా దర్శకధీరుడు రాజమౌళి కారణం. 'బాహుబలి' ఆడిషన్స్ కోసం వచ్చిన రాశి ఖన్నాకు 'ఊహలు గుసగుసలాడే' ఆడిషన్స్ కి వెళ్ళమని రాజమౌళి సూచించాడట. ఈ విషయాన్ని రాశి ఖన్నా స్వయంగా తెలిపింది.
తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న రాశి ఖన్నా తనకు 'ఊహలు గుసగుసలాడే' సినిమాలో అవకాశం ఎలా వచ్చిందో పంచుకుంది. "బాహుబలిలో తమన్నా పోషించిన అవంతిక పాత్ర కోసం ఆడిషన్ ఇవ్వడానికి వెళ్ళాను. అయితే రాజమౌళి గారు నన్ను చూసి నువ్వు లవ్ స్టోరీలకు సరిగ్గా పోతావు.. నా స్నేహితుడు( సాయి కొర్రపాటి) ఒక సినిమా చేస్తున్నారు, వెళ్లి కలవమని చెప్పారు. అలా 'ఊహలు గుసగుసలాడే' కథ విన్నాను. అప్పుడు సౌత్ సినిమాలంటే పాటలు, డ్యాన్స్ లు మాత్రమే అనే తప్పుడు ప్రచారం ఉండేది. కానీ ఊహలు గుసగుసలాడే కథ విన్నాక అది తప్పని నాకు అర్థమైంది. అప్పటినుంచి సౌత్ సినిమాలపై నాకు రెస్పెక్ట్ పెరిగింది. ఎప్పటికైనా రాజమౌళి గారి దర్శకత్వంలో నటించాలని ఉంది" అని రాశి ఖన్నా చెప్పుకొచ్చింది.