English | Telugu

'ఖుషి'కి 'జనతా గ్యారేజ్' టచ్!

టాలెంటెడ్ బ్యూటీ సమంతకి అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భలేగా కలిసొచ్చింది. ఈ బేనర్ లో సామ్ నటించిన 'జనతా గ్యారేజ్', 'రంగస్థలం', 'పుష్ప - ది రైజ్' (స్పెషల్ సాంగ్) ఘన విజయం సాధించాయి. కట్ చేస్తే.. ప్రస్తుతం ఈ కాంబోలో మరో ప్రాజెక్ట్ వస్తోంది. అదే.. 'ఖుషి'. యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటు విజయ్ దేవరకొండతోనూ, అటు శివ నిర్వాణతోనూ సమంత కి ఇది రెండో చిత్రం కావడం విశేషం. శివ డైరెక్షన్ లో 'మజిలీ' వంటి బ్లాక్ బస్టర్ మూవీ చేసిన సమంత.. విజయ్ తో 'మహానటి'లో కలిసి సందడి చేసింది. ఇక మంచి అంచనాల నడుమ తెరకెక్కుతున్న 'ఖుషి'.. సెప్టెంబర్ 1 న థియేటర్స్ లోకి రాబోతోంది.

ప్రస్తావించదగ్గ విషయం ఏమిటంటే.. గతంలో ఇదే సెప్టెంబర్ 1న సమంత - మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్ లో రూపొందిన 'జనతా గ్యారేజ్' రిలీజ్ అయ్యింది. మరి.. 'జనతా గ్యారేజ్' విడుదల తేదీనే రాబోతున్న 'ఖుషి' కూడా ఆ బ్లాక్ బస్టర్ మేజిక్ ని రిపీట్ చేస్తుందేమో చూడాలి.