English | Telugu
ఓవర్ సీస్‌లో 'జైలర్' జోరు
Updated : Aug 6, 2023
సూపర్‌స్టార్ రజినీకాంత్ తన లేటెస్ట్ మూవీ 'జైలర్'తో బాక్సాఫీస్ దగ్గర జోరు చూపించటానికి సిద్ధమవుతున్నారు. నిజం చెప్పాలంటే తలైవర్‌కి ఉన్న పాన్ వరల్డ్ మాస్ ఇమేజ్‌కి సరైన హిట్ మూవీ వచ్చి చాలా రోజులే అవుతుందనాలి. అలాంటి హిట్ కోసం ఆయన అభిమానులు, ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాలే కాదు, రజినీకాంత్ సైతం వెయిట్ చేస్తున్నారు. రీసెంట్‌గా రిలీజైన 'జైలర్' ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పీక్స్‌కి చేరుకున్నాయి. ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌కు తగ్గట్టే ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 'జైలర్' ఓవర్‌సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.
ఇప్పటికే యు.ఎస్ సహా ఇతర లొకేషన్స్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ కింద 500 K డాలర్స్ వచ్చాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. సినిమా రిలీజ్‌కు ఓవర్ సీస్ పరంగా చూస్తే మరో మూడు రోజులున్నాయి. ఇదే జోరుని 'జైలర్' కొనసాగిస్తే ఓవర్ సీస్‌లో ఒక మిలియన్ అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్స్ వస్తాయని భావిస్తున్నారు. ఓవర్ సీస్‌లోనే ఆ రేంజ్‌లో ఉంటే ఇక తమిళనాడు సహా మన ఏరియాల్లో కలెక్షన్స్ బాగానే వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. తొలి రోజు కలెక్షన్స్ రజినీకాంత్ కెరీర్ బెస్ట్ అవుతుందని లెక్కలు వేస్తున్నారు. ఇక సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా వసూళ్ల రేంజ్ మారిపోతుందనటంలో సందేహమే లేదు.
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ 'జైలర్' సినిమాను నిర్మిస్తున్నారు. రమ్యకృష్ణ, తమన్నా, యోగిబాబు తదితరులు ఇందులో కీలక పాత్రల్లో మెప్పించబోతున్నారు. రజినీకాంత్ గత చిత్రాల కంటే ఇందులో యాక్షన్ డోస్ ఎక్కువగా ఉండేలా ఉందని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది.