English | Telugu
మగ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా
Updated : Aug 6, 2023
హీరోయిన్ ఇలియానా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఆగస్ట్ 1న బిడ్డ పుట్టినప్పటికీ నాలుగు రోజుల తర్వాతే ఆమె బిడ్డ పుట్టిన విషయాన్ని ధృవీకరించారు. చిన్నారి ఫొటోను తన సోషల్ మీడియాలో షేర్ చేయటమే కాకుండా తన పేరుని కూడా చెప్పింది. కోవా ఫీనిక్స్ డోలన్ నా ప్రియమైన కొడుకు.. వాడిని మీ అందరికీ పరిచయం చేస్తున్నాను. ఈ ప్రపంచానికి వాడిని పరిచయం చేయటంపై చాలా సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. దీంతో సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలు, నెటిజన్స్ ఇలియానాకు కంగ్రాట్స్ చెబుతున్నారు.
గత కొంతకాలంగా ఇలియానా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆమె చాలా యాక్టివ్‌గా ఉంది. ఈ క్రమంలో ఆమె ఉన్నట్లుండి ఏప్రిల్‌లో తల్లికాబోతున్నట్లు తెలియజేసింది. కానీ ఇలియానా ప్రియుడు ఎవరా? అని మాత్రం చెప్పలేదు. దీంతో ఆ వ్యక్తి గురించి ఆరాలు తీయటానికి కొందరు నెటిజన్స్ ప్రయత్నించినా ఏమీ వర్కవుట్ కాలేదు. చివరకు ఆమె జూలైలో తన ప్రియుడితో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. కానీ తన వివరాలను మాత్రం ఆమె బయటకు చెప్పలేదు.
రామ్ హీరోగా నటించిన దేవదాస్ చిత్రంతో ఇలియానా హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసింది. స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తర్వాత బాలీవుడ్‌లోకి కూడా అడుగు పెట్టింది. అక్కడ సక్సెస్ కాలేదు. అదే క్రమంలో ఆమె తెలుగు సినిమాలను దూరం పెట్టింది. దీంతో ఆమెకు సినిమా అవకాశాలు క్రమంగా తగ్గిపోయాయి. తర్వాత ఒకరితో ప్రేమలో ఉండింది. ఆ వ్యక్తితో బ్రేకప్ అయ్యింది. ఈ బ్రేకప్‌తో ఆమె మానసికంగా చాలా డిస్ట్రబ్ అయ్యింది. తర్వాత కోలుకుని సినీ రంగంలోకి అడుగు పెట్టింది. తెలుగులో రవితేజతో కలిసి అమర్ ఆక్బర్ ఆంటోని చిత్రంలో నటించినప్పటికీ అది వర్కవుట్ కాలేదు. సినిమాల్లో అవకాశాలు రాలేదు.