English | Telugu

తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరో చెప్పిన ఇలియానా!

గోవా బ్యూటీ ఇలియానా కొద్ది నెలల క్రితం తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. పెళ్లి కాకుండానే ఆమె గర్భం దాల్చడం హాట్ టాపిక్ అయింది. ఆమె ప్రియుడు ఎవరో తెలుసుకోవడం కోసం అందరూ ఎంతో ఆసక్తి చూపించారు. కానీ ఇలియానా మాత్రం తన ప్రియుడు ఎవరనే విషయాన్ని రివీల్ చేయకుండా సస్పెన్స్ మైంటైన్ చేస్తూ వచ్చింది. అయితే తాజాగా ఆ సస్పెన్స్ కి తెరదించుతూ, తన ప్రియుడిని ప్రపంచానికి పరిచయం చేసింది.

ఇంతకాలం ప్రియుడు ఫేస్ ని రివీల్ చేయకుండా సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసిన ఇలియానా, తాజాగా అతని ఫేస్ ని రివీల్ చేసింది. 'డేట్ నైట్' అంటూ తన ప్రియుడితో దిగిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది ఇలియానా. గతంలో కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ తో ఇలియానా ప్రేమలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఇలియానా షేర్ చేసిన ఫోటోలలో ఉన్నది సెబాస్టియన్ కాదు. దీంతో ఇలియానా ప్రియుడి వివరాల గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు నెటిజన్లు. మరి ఇంతకాలానికి ప్రియుడి ఫేస్ ని రివీల్ చేసిన ఇలియానా, త్వరలోనే అతని వివరాలను కూడా తెలుపుతుందేమో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.