English | Telugu

'బ్రో'లో పవన్ ది గెస్ట్ రోల్ కాదు.. రివీల్ చేసిన సాయి తేజ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటిస్తున్న చిత్రం 'బ్రో'. తమిళ్ మూవీ 'వినోదయ సిత్తం'కి రీమేక్ గా రూపొందుతోన్న ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడం విశేషం. ఈ సినిమా జూలై 29 ప్రేక్షకుల ముందుకు రానుంది.

'బ్రో' సినిమాలో పవన్ పాత్ర నిడివిపై అభిమానుల్లో అనుమానాలు ఉన్నాయి. ఆయన పాత్ర నిడివి 40 నిమిషాలకు మించి ఉండదని ఎప్పటినుంచో వినిపిస్తున్న మాట. అందుకే కొందరు అభిమానులు దీనిని అసలు పవన్ సినిమాగానే పరిగణించడంలేదు. అయితే అలాంటి అభిప్రాయాలను సాయి తేజ్ చెక్ పెట్టాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సాయి తేజ్ మాట్లాడుతూ.. బ్రో సినిమాలో మొదటి 10-15 నిమిషాలు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు కనిపించరని, కానీ అక్కడినుంచి ఆయన సినిమా చివరివరకు ఉంటారని తెలిపాడు. సాయి తేజ్ మాటలు పవన్ అభిమానుల్లో ఒక్కసారిగా ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి అనడంలో సందేహం లేదు.