English | Telugu
'బేబీ' ప్రభంజనం.. మూడు రోజుల్లోనే 20 కోట్లు!
Updated : Jul 17, 2023
చిన్న సినిమాగా విడుదలైన 'బేబీ' బాక్సాఫీస్ దగ్గర పెద్ద సంచలనాలే సృష్టిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ.20 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సత్తా చాటింది. ఇప్పటికే లాభాల్లోకి ఎంటరై హిట్ స్టేటస్ దక్కించుకున్న ఈ మూవీ, ఫుల్ రన్ లో రూ.40 కోట్ల గ్రాస్ రాబట్టినా ఆశ్చర్యంలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.2.60 కోట్ల షేర్, రెండో రోజు రూ.2.98 కోట్ల షేర్ రాబట్టిన బేబీ సినిమా..మూడో రోజు ఆదివారం కావడంతో రూ.3.77 కోట్ల షేర్ తో సత్తా చాటింది. దీంతో మొదటి వారాంతం ముగిసేసరికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.9.35 కోట్ల షేర్ సాధించింది. ఏరియాల వారీగా చూస్తే మూడు రోజుల్లో నైజాంలో రూ.3.93 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.1.25 కోట్ల షేర్, ఆంధ్రాలో రూ.4.17 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇక రెస్టాఫ్ ఇండియా రూ.43 లక్షల షేర్, ఓవర్సీస్ లో రూ.1.55 కోట్ల షేర్ వసూలు చేసిన బేబీ.. మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.11.33 కోట్ల షేర్(20.90 కోట్ల గ్రాస్)తో సత్తా చాటింది.
ఓవరాల్ గా రూ.7.40 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన బేబీ.. వరల్డ్ వైడ్ గా మొదటి రోజు రూ.3.48 కోట్ల షేర్, రెండో రోజు రూ.3.56 కోట్ల షేర్, మూడో రోజు రూ.4.29 కోట్ల షేర్ తో బాక్సాఫీస్ జోరు చూపించింది. ఇప్పటికే బయ్యర్లకు మూడు కోట్లకు పైగా లాభాలు తెచ్చిపెట్టిన ఈ సినిమా, ఫుల్ రన్ లో పది కోట్లకు పైగా లాభాలను తెచ్చే అవకాశముందని ట్రేడ్ వర్గాల అంచనా. జూలై 28న 'బ్రో' విడుదలయ్యే వరకు బాక్సాఫీస్ దగ్గర పెద్ద సినిమాల తాకిడి లేదు. దీంతో బేబీ సినిమా మరో పది రోజులు వసూళ్లు రాబట్టడానికి మంచి అవకాశముంది. యూత్ ని ఆకట్టుకుంటున్న ఈ సినిమా ఫుల్ రన్ లో ఏ స్థాయిలో వసూళ్లు రాబడుతుందో చూడాలి.