English | Telugu
'హాయ్ నాన్న' ఫస్ట్ రివ్యూ.. నాని ఖాతాలో మరో ఫీల్ గుడ్ మూవీ!
Updated : Dec 5, 2023
'దసరా' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నేచురల్ స్టార్ నాని నటించిన చిత్రం 'హాయ్ నాన్న'. శౌర్యువ్ దర్శకత్వంలో వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సినిమాలో నానితో పాటు మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ఈ డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. సెన్సార్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ మూవీ ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట.
'దసరా'లో పూర్తి స్థాయి మాస్ రోల్ లో మెప్పించిన నాని, 'హాయ్ నాన్న' కోసం పూర్తిగా క్లాస్ బాట పట్టాడు. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో బలమైన భావోద్వేగాలు ఉంటాయని ప్రచార చిత్రాలతోనే అర్థమైపోయింది. ఇప్పటికే సినిమా చూసిన సెన్సార్ సభ్యులు, ఇండస్ట్రీ వర్గాలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. ఈ సినిమాలో బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఉన్నాయట. ముఖ్యంగా నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారాల కాంబినేషన్ లో వచ్చే సీన్స్ కట్టి పడేస్తాయట. నటీనటుల పెర్ఫార్మెన్స్ కూడా సినిమాకి ప్రధాన బలంగా నిలిచిందట. నాని, మృణాల్ లతో పోటీ పడుతూ బేబీ కియారా తన నటనతో సర్ ప్రైజ్ చేసిందట. మొత్తానికి ఈ సినిమాకి నాని కెరీర్ లో ఓ మంచి ఫీల్ గుడ్ మూవీగా మిలిగిపోతుందని ఇండస్ట్రీ టాక్.