English | Telugu

తన భార్యకి ఆ యువ హీరోని తమ్ముడ్ని చేస్తున్న దర్శకుడు  

ప్రముఖ హీరోయిన్ నయన తార నుంచి తాజాగా అన్నపూరని అనే సినిమా వచ్చింది. ఈ సినిమా ప్రస్తుతం తమిళనాడులో విజయదుందుభి మోగిస్తుంది. ఈ చిత్రం తర్వాత నయన్ తన భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుంది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన తాజా న్యూస్ ఒకటి తమిళ సినీప్రేమికుల్ని ఊర్రుతలూగిస్తుంది.

విఘ్నేష్ శివన్ ఇటీవలే లవ్ టుడే లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు అలాగే హీరో అయిన ప్రదీప్ రంగనాథన్‌ హీరోగా ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఈ విషయాన్ని ఇటీవలే అధికారకంగా కూడా ప్రకటించారు. ఇప్పుడు ఈ సినిమాలో ప్రదీప్ సోదరిగా నయనతార నటించబోతుంది. ఇప్పుడు ఈ వార్తతో ఈ ప్రాజెక్ట్ సౌత్ లోనే క్రేజీ ప్రాజెక్ట్ గా మారింది.పైగా పాన్ ఇండియా మూవీగా మారినా కూడా ఆశ్చర్య పడక్కరలేదని సినీ మేధావులు చెప్తున్నారు ఎందుకంటే నయన తార ఆల్రెడీ షారుక్ తో జవాన్ మూవీ చేసి హిందీ ప్రేక్షకులని తన నటనతో ఆకట్టుకుంది. అలాగే ప్రదీప్ కూడా లవ్ టుడే మూవీ తో సౌత్ ప్రేక్షకులందరికీ పరిచయమయ్యాడు.

త్వరలో నే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని తాజాగా విజయ్ తో లియో వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన లలిత్ కుమార్ నిర్మిస్తున్నాడు.ఈ సినిమాలో దర్శకుడు విఘ్నేష్ తన భార్య నయన్ కోసం ఒక అద్భుతమైన పాత్రను డిజైన్ చేసినట్లు సమాచారం. లవ్ టుడే సినిమాతో తమిళ బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు నయనతారతో స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషమే అని చెప్పాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.