English | Telugu

‘ఇండియన్‌ 2’పై శంకర్‌ క్రేజీ అప్డేట్‌

యూనివర్సల్‌ స్టార్‌ కమల్‌హాసన్‌, స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్‌ మూవీ ‘ఇండియన్‌ 2’. 1996లో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇండియన్‌’ సినిమాకు ఇది సీక్వెల్‌గా రానుంది. ఎన్నో కష్టాలను భరించి సాధించిన స్వతంత్ర భారతదేశంలో లంచగొండితనం వల్ల జరుగుతున్న అనర్థాలపై ఓ వయసు మళ్లిన సేనాపతి చేసిన పోరాటమే ఆ చిత్రం. దానికి కొనసాగింపుగా ‘ఇండియన్‌ 2’ వచ్చే ఏడాదిలో రిలీజ్‌ కానుంది. అంటే 28 ఏళ్ల తర్వాత మరోసారి సేనాపతి సిల్వర్‌ స్క్రీన్‌పై సంచలనాన్ని సృష్టించటానికి రెడీ అవుతున్నాడు.

‘ఇండియన్‌’ సినిమా బ్లాక్‌ బస్టర్‌ అయిన నేపథ్యంలో ‘ఇండియన్‌ 2’పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉంటాయనటంలో సందేహం లేదు. దీంతో మేకర్స్‌, శంకర్‌ ఆ అంచనాలను మించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు ఒకటి రెండు పోస్టర్స్‌ మినహా మరేమీ అప్‌డేట్‌ రాలేదు. అభిమానులు, ట్రేడ్‌ వర్గాలు అసలు ‘ఇండియన్‌ 2’లో సేనాపతి ఎలా ఉండబోతున్నాడోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఎదురుచూపులకు శంకర్‌ సైడ్‌ నుంచి సమాధానం దొరికేసింది. నవంబర్‌ 3న ‘ఇండియన్‌ 2’ ఇంట్రో గ్లింప్స్‌ రూపంలో ఉంటుందని శంకర్‌ తెలిపారు.

‘ఇండియన్‌ 2’లో భారీ తారాగణం కూడా ఉంటుంది. కమల్‌ హాసన్‌తో పాటు కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సిద్ధార్థ్‌, ఎస్‌.జె.సూర్య, బాబీ సింహ తదితరులు నటిస్తున్నారు. ముఖ్యంగా కాజల్‌ గతంలో చేయని ఓ విభిన్నమైన పాత్రలో కనిపించనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సుభాస్కరన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.