English | Telugu
రామ్ కందిరీగ ఆడియో మళ్ళీ వాయిదా
Updated : Jul 13, 2011
రామ్ "కందిరీగ" ఆడియో మళ్ళీ వాయిదా పడిందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై, చురుకైన యువ హీరో రామ్ హీరోగా, "దేశముదురు" భామ హన్సిక మోత్వానీ హీరోయిన్ గా, సంతోష్ శ్రీనివాస్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం "కందిరీగ". ఈ రామ్ "కందిరీగ" చిత్రానికి యస్.యస్.థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
రామ్ "కందిరీగ" చిత్రం ఆడియో ముందుగా అనుకున్న ప్రకారం జూలై 10 వ తేదీన విడుదల కావలసి ఉంది. కానీ అది వాయిదా పడింది. ఆ తర్వాత రామ్ "కందిరీగ" చిత్రం ఆడియో జూలై 14 వ తేదీన అని వినపడింది. కానీ మళ్ళీ ఆరోజున కూడా వాయిదా పడింది. ఇప్పుడు రామ్ "కందిరీగ" ఆడియో సినిమా ఆడియో జూలై 22 వ తేదీన విడుదల కానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. విచిత్రమేమిటంటే రామ్ "కందిరీగ" ఆడియోవిడుదల ఇన్నిసార్లు వాయిదా పడినా వెన్యు జయభేరి క్లబ్ నుండి మాత్రం మారలేదు.