English | Telugu

కేరళకు వెళ్తున్న పవన్ కళ్యాణ్

కేరళకు వెళ్తున్న పవన్ కళ్యాణ్ అని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరల్లోకి వెళితే సంఘమిత్ర, అర్కా మీడియా పతాకాలపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సారా జేన్ హీరోయిన్ గా, ప్రముఖ తమిళ దర్శకుడు విష్ణువర్థన్ దర్శకత్వంలో, నీలిమ తిరుమల శెట్టి, శోభు యార్లగడ్డ సంయుక్తంగా నిర్మిస్తున్నవిభిన్నకథా చిత్రం "కాళీ"(ఈ పేరింకా అధికారికంగావెలువడలేదు). ఈ "కాళీ" చిత్రం షూటింగ్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జూలై 18 నుంచీ కేరళకు వెళుతున్నారు.

కేరళలో పొల్లాచ్చి, అలెప్పీలోనూ, మరికొన్ని సుందర ప్రదేశాల్లోనూ, అలాగే తమిళ నాడులోని అందమైన ప్రదేశాల్లోనూ ఈ చిత్రం షూటింగ్ జరుతారట. ఈ చిత్రంలో అడవిశేష్, అంజలీ లావణ్య మరో జంటగా నటిస్తున్నారు. మాఫియా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్ విలన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సినీ రచయిత అబ్బూరి రవి మాటలు వ్రాస్తున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.