English | Telugu

నాన్న సినిమాలు రీమేక్ చేయను - రామ్ చరణ్

"నాన్న సినిమాలు రీమేక్ చేయను" అని రామ్ చరణ్ అంటున్నాడట. వివరాల్లోకి వెళితే మేగా స్టార్ చిరంజీవి గతంలో 1980 ల్లో నటించిన బ్లాక్ బస్టర్ సినిమా "ఖైదీ" ని రిమేక్ చేద్దామని చాలా మంది నిర్మాతలు, రచయితలు రామ్ చరణ్ అంగీకారం కోసం ఎదురుచూస్తున్నారు. చిరంజీవి "ఖైదీ" సినిమాకి సంభాషణలందించిన పరుచురి బ్రదర్స్ ఇప్పుడు రామ్ చరణ్ ఆ సినిమా రీమేక్ కు కూడా సంభాషణలందించటానికి ఉబలాటపడుతున్నారట.

ఈ విషయాలపై స్పందిస్తూ రామ్ చరణ్ "ఖైదీ" సినిమా నాన్నగారి సినీ జీవితాన్ని మలుపుతిప్పింది. ఆయనకు ఒక స్టార్ కమర్షియల్ హీరో ఇమేజ్ నిచ్చింది. అలాంటి గొప్ప సినిమాని నేను హీరోగా రీమేక్ చేయటమంటే అదొక సాహసమే అవుతుంది. అది నాకిష్టంలేదు" అని అన్నారు. నిజానికి రామ్ చరణ్ ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకోవటానికి మొగ్గుచూపుతున్నాడే కానీ, తన తండ్రి హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమాల రీమేక్ లలో నటించాలనుకోవటం లేదు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.