English | Telugu

సంక్రాంతికి సై.. బరిలో ఎవరున్నా తగ్గేదేలే!

వచ్చే ఏడాది సంక్రాంతికి తెలుగు సినిమాల బాక్సాఫీస్ వార్ రసవత్తరంగా ఉండనుంది. ఇప్పటికే 2024 సంక్రాంతి సీజన్ పై 'గుంటూరు కారం', 'ఈగల్', 'నా సామి రంగ' వంటి సినిమాలు కర్చీఫ్ వేశాయి. అలాగే 'కల్కి 2898 AD'(ప్రాజెక్ట్ k) సంక్రాంతికి వచ్చే అవకాశం లేకపోవడంతో, 'సలార్'ని పొంగల్ పోరులో దింపాలని డిస్ట్రిబ్యూటర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారట. ఒకవేళ 'సలార్' కూడా సంక్రాంతికే ఫిక్స్ అయితే.. ఈ స్టార్ సినిమాల నడుమ ఎప్పుడో పండగ సీజన్ పై కన్నేసిన 'హనుమాన్' సినిమా పరిస్థితి ఏంటనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే 'హనుమాన్' టీమ్ మాత్రం బరిలో ఎవరున్నా తగ్గేదేలే అంటోంది.

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ 'హనుమాన్'. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. భారీ బడ్జెట్ చిత్రాలను మించేలా విజువల్స్ ఉన్నాయనే ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మొదట ఈ సినిమాని ఈ ఏడాది మే లోనే విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి ఎక్కువ సమయం కావాల్సి రావడంతో.. వచ్చే ఏడాది జనవరి 12 కి వాయిదా వేశారు.

'హనుమాన్'పై మొదటి నుంచి మంచి బజ్ ఉంది. ముఖ్యంగా టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. అయినప్పటికీ స్టార్ హీరోల సినిమాలు బరిలో ఉంటే, వాటిని కాదనుకొని ప్రేక్షకులు 'హనుమాన్'ని ఆదరిస్తారా అనే అనుమానాలున్నాయి. అందుకే ఈ సినిమా సంక్రాంతికి రాకపోవచ్చని కొందరు భావించారు. అయితే మూవీ టీమ్ మాత్రం అసలు తగ్గడంలేదు. సంక్రాంతికే హనుమాన్ సినిమా వస్తుందని తాజాగా సోషల్ మీడియా వేదికగా తెలిపిన దర్శకుడు ప్రశాంత్ వర్మ.. ఈ వినాయకచవితి(సెప్టెంబర్ 18) నుంచి మూవీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నట్లు తెలిపారు.

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో అమృత అయ్యర్ , వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శివేంద్ర సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి గౌర హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.