English | Telugu
ఇంట్రస్టింగ్... లియోతో అజిత్ సినిమా కనెక్షన్!
Updated : Sep 13, 2023
విజయ్ హీరోగా నటిస్తున్న సినిమా లియో. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 19న విడుదల కానుంది లియో సినిమా. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. బ్లడీ స్వీట్ అంటూ ప్రోమో విడుదల చేసినప్పటి నుంచే ఈ సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ మామూలుగా లేవు. ఇటీవల విడుదల చేసిన పాటకు కూడా సూపర్‌డూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలోని కీ పార్టును కాశ్మీర్‌లో తెరకెక్కించారు లోకేష్ కనగరాజ్. ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడే అజిత్ సినిమా కూడా మొదలు కావాల్సింది. 2023 సంక్రాంతికి అజిత్, విజయ్ ఇద్దరూ సిల్వర్‌స్క్రీన్స్ మీద పోటీపడ్డారు. ఎవరికి వారు సక్సెస్ సాధించారు. ఆ తర్వాత ఇద్దరూ ఒకేసారి సినిమాను మొదలుపెట్టి, మళ్లీ అక్టోబర్‌లోనూ థియేటర్ల దగ్గర పోటీపడతారనే అందరూ అనుకున్నారు. అయితే అజిత్ సినిమా ఆలస్యమైంది. స్టార్ట్ కావాల్సిన విఘ్నేష్ శివన్ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత సీన్‌లోకి డైరక్టర్ మగిళ్ తిరుమేని కూడా వచ్చారు. ఆ గ్యాప్‌లోనే బైక్ మీద ట్రిప్ కి వెళ్లారు అజిత్. ఫ్యామిలీతో వెకేషన్ కూడా వెళ్లారు.
త్వరలోనే అబుదాబిలో అజిత్ సినిమా షూటింగ్ మొదలుకానుంది. విడాముయర్చి అని టైటిల్ పెట్టారు నిర్మాతలు. ఈ సినిమాకు సంబంధించిన క్రూ ఆల్రెడీ అబుదాబికి ట్రావెల్ చేస్తోంది. అక్కడ షూటింగ్‌కి కావాల్సిన అన్ని హంగులూ సమకూరుతున్నాయి. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. చెన్నైలోని, నార్త్ ఇండియాలోనూ కొంత భాగాన్ని తెరకెక్కించి, ఆ తర్వాత పూర్తిగా ఫారిన్ లొకేషన్లలోనే తెరకెక్కించనున్నట్టు టాక్. ఈ సినిమాకు విజయ్ నటించిన లియోకి నాలుగు విషయాల్లో పోలిక ఉంది. అది కూడా నటీనటుల పరంగానే. విజయ్ నటించిన లియోలో నటించిన సంజయ్ దత్, త్రిష, అర్జున్ ఈ సినిమాలోనూ కీ రోల్స్ లో కనిపిస్తారు. అర్జున్ దాస్ కూడా కీ రోల్ చేయనున్నారట.