English | Telugu
హన్సిక కమ్‌బ్యాక్ సినిమా ‘మ్యాన్’
Updated : Mar 9, 2023
హన్సిక మోత్వాని పెళ్లి తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నారు. మ్యాన్ అనే సినిమాను ప్రకటించారు కొత్తపెళ్లికూతురు. విమెన్ సెంట్రిక్‌గా సాగే సినిమా మ్యాన్. ఇగోర్ దర్శకత్వం వహస్తున్నారు. మెడ్రాస్ స్టూడియోస్ నిర్మిస్తోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ని విడుదల చేశారు. యాక్షన్ ప్యాక్డ్ క్రైమ్ థ్రిల్లర్ తరహా సినిమా ఇది. హన్సిక మ్యాన్ సినిమా స్నీక్‌పీక్‌ని ట్విట్టర్‌లో విడుదల చేశారు మేకర్స్. ఇది హన్సిక నటిస్తున్న 51వ సినిమా. ఈ ఫస్ట్ లుక్‌లో హన్సిక ఇన్‌టెన్స్ లుక్ కనిపిస్తోంది. ఆమె ఫేస్‌ని రెడ్ క్లాత్‌తో చుట్టినట్టు కనిపిస్తోంది. కళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. కాస్త భయం కలిగించేలా ఉంది పోస్టర్. జిబ్రన్ సంగీతం అందించారు. మణికందన్ సినిమాటోగ్రఫీ చేశారు. చంద్రకుమార్ ఈ సినిమాకు ఎడిటింగ్ చేశారు.
పొన్ పార్తిబన్, శరణ్య భాగ్యరాజ్ స్క్రీన్‌ప్లేని సమకూర్చారు. హన్సిక మోత్వాని వెడ్డింగ్ డాక్యుమెంటరీ లవ్ షాదీ డ్రామా రీసెంట్‌గా విడుదలైంది. అందులో తన గత ప్రేమ గురించి కూడా వివరించారు హన్సిక. ఆ ప్రేమను దాటుకుని మరొకరికి యస్ చెప్పడానికి తనకు ఏడెనిమిది సంవత్సరాలు పట్టిందని అన్నారు. తాను ప్రేమను నమ్ముతానని, తాను రొమాంటిక్ పర్సన్ అని, అలాగని రొమాంటిక్ భావాలను వ్యక్తం చేయడానికి ఇష్టపడనని, వివాహ వ్యవస్థను నమ్ముతానని చెప్పారు హన్సిక. హన్సికకు తన చిన్ననాటి స్నేహితుడు సోహెల్ కఠూరియాతో ఇటీవల వివాహం జరిగింది. కొత్త పెళ్లికూతురిగా జీవితాన్ని సరికొత్తగా చూస్తున్నానని అన్నారు హన్సిక. అలాగని పనిని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయలేనని తెలిపారు. వ్యక్తిగత జీవితాన్ని, వృత్తి జీవితాన్ని తాను బ్యాలన్స్ చేసుకోవడానికి రెడీగా ఉన్నానని అన్నారు.