English | Telugu
‘అందరితోపాటు నేనూ’ అంటూ రంగంలోకి దిగిన హన్సిక!
Updated : Sep 14, 2023
ఇప్పుడు నటీనటులకు సినిమాలెంత ముఖ్యమో డిజిటల్ ప్లాట్‌ఫామ్ కూడా అంతే ముఖ్యమని అర్థమైనట్టుంది. అందుకే చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఆర్టిస్టులెవ్వరైనా డిజిటల్‌లో కనిపించేందుకు, అందర్నీ అలరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు, హీరోయిన్లు ఓటీటీల ద్వారా ఎంటర్‌టైన్ చేశారు. అందరితోపాటు నేనూ అంటూ హన్సిక కూడా డిజిటల్ రంగంలోకి దిగింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో సెప్టెంబర్ 15 నుంచి స్ట్రీమింగ్ అవ్వనున్న వెబ్ సిరీస్ ‘ఎంవై 3’లో నటిస్తోంది. పెళ్ళి తర్వాత కూడా హీరోయిన్‌గా బిజీగా కనిపిస్తున్న హన్సికకు ఇదే మొదటి వెబ్ సిరీస్. మూగేన్ రావు హీరోగా నటిస్తున్న ఈ సిరీస్‌కి రాజేష్ ఎం. దర్శకుడు. హన్సికతోపాటు శంతను భాగ్యరాజా, జనని అయ్యర్ నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో హన్సిక మనిషిగా, రోబోగా రెండు పాత్రల్లో కనిపిస్తుంది. తెలుగు, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఈ వెబ్ సిరీస్ అందుబాటులో ఉంటుంది.