English | Telugu

మూడు రోజుల్లో మూడు సార్లు.. అంత నచ్చిందా!

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ లేటెస్ట్ మూవీ 'జవాన్' బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా వారం రోజుల్లోనే రూ.650 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సత్తా చాటింది. ఈ నేపథ్యంలో తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, 'జవాన్' టీంని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.

షారుఖ్ మాస్ అవతార్ తో పాటు ఆయన స్వాగ్ చూసి ఫిదా అయ్యినట్లు బన్నీ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. అలాగే విజయ్ సేతుపతి, నయనతార, దీపికా నటనతో పాటు, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ని, డైరెక్టర్ అట్లీ ని కూడా ప్రశంసించారు.

అల్లు అర్జున్ చేసిన ట్వీట్ కి షారుఖ్ సూపర్బ్ రిప్లై ఇచ్చారు. బన్నీకి థాంక్స్ చెప్పిన షారుఖ్.. "స్వాగ్ విషయానికి వస్తే స్వయంగా ఫైరే నన్ను ప్రశంసిస్తుంది. మూడు రోజుల్లో మూడు సార్లు పుష్ప సినిమా చూసిన నేను మీ నుండి ఏదో నేర్చుకున్నానని ఒప్పుకోక తప్పదు!" అంటూ షారుఖ్ ట్వీట్ చేయడం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని ఆనందంలో నింపింది. త్వరలోనే స్వయంగా వచ్చి బన్నీని కలుస్తానని షారుఖ్ చెప్పడం విశేషం. మూడు రోజుల్లో మూడు సార్లు పుష్ప సినిమా చూశానని షారుఖ్ చెప్పడంతో ఆయనకు సినిమా అంత నచ్చిందా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

'తగ్గేదే లే' అంటూ పుష్పరాజ్ గా పాన్ వరల్డ్ స్థాయిలో గుర్తింపును తెచ్చుకున్నారు అల్లు అర్జున్. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మ్యానరిజమ్స్ ని రీక్రియేట్ చేయని సెలెబ్రిటీ లేడు. సినిమాల నుంచి క్రికెట్ వరకూ ప్రతి ఒక్కరూ పుష్ప మ్యానరిజమ్స్ ని ఫాలో అయిన వాళ్లే. లేటెస్ట్ గా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కూడా పుష్ప సినిమా గురించి, అల్లు అర్జున్ గురించి ప్రశంసిస్తూ ట్వీట్ చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.