English | Telugu
ముగ్గురు హీరోయిన్లతో బాలయ్యబాబు ముద్దు.. ముచ్చట!
Updated : Dec 6, 2023
ఈ సంవత్సరం ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ వంటి సూపర్‌హిట్ సినిమాలతో మంచి ఊపు మీద ఉన్న నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన 109వ సినిమా షూటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినమాకు సంబంధించిన అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింత పెంచుతున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తోపాటు దర్శకుడు త్రివిక్రమ్ సొంత బేనర్ ఫార్చ్యూన్ ఫోర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉంది. ఈమధ్యకాలంలో నందమూరి బాలకృష్ణ చేస్తున్న క్యారెక్టర్లన్నీ విభిన్నంగానే ఉంటున్నాయి. దర్శకులు కూడా బాలకృష్ణను డిఫరెంట్‌గా ప్రజెంట్ చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు దర్శకుడు బాబీ కూడా తన సినిమాలో బాలయ్యను మూడు డిఫరెంట్ షేడ్స్‌లో చూపించబోతున్నాడు. మూడు డిఫరెంట్ టైమ్ జోన్స్‌లో నడిచే ఈ కథలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. ఇప్పటికే ఊర్వశీ రౌతెల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారని ప్రకటించారు మేకర్స్. మరో ముఖ్యమైన హీరోయిన్ క్యారెక్టర్ కోసం ఓ సీనియర్ హీరోయిన్‌తో దర్శకనిర్మాతలు సంద్రింపులు జరుపుతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమాలో నటించే మూడో హీరోయిన్ విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
యంగ్ జనరేషన్ హీరోలు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ ఆకట్టుకుంటున్న నేపథ్యంలో బాలయ్యబాబు కూడా ఈమధ్య తను చేసే సినిమాల్లో క్యారెక్టర్స్ వైవిధ్యంగా ఉండేలా చూసుకుంటున్నారు. బాబీ కాంబినేషన్‌లో చేస్తున్న సినిమాలోని మాస్ క్యారెక్టర్ బాలయ్యబాబు ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయిస్తుందని సమాచారం. అలాగే స్టైలిష్‌గా ఉండే మరో క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుందట. మెగాస్టార్ చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాన్ని చేసి సూపర్‌హిట్ కొట్టిన బాబీ.. ఇప్పుడు బాలకృష్ణ సినిమాను అంతకుమించిన రేంజ్‌లో రూపొందించేందుకు కృషి చేస్తున్నాడు. అందుకే ఓ పవర్‌ఫుల్ స్టోరీతో బాలకృష్ణ 109వ సినిమాను ఓ కొత్త పంథాలో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన షెడ్యూల్ ప్రస్తుతం ఊటీలో జరుగుతోంది. షూటింగ్‌ను వీలైనంత స్పీడ్‌గా కంప్లీట్ చేసి టీజర్ రిలీజ్ చెయ్యాలని బాబీ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే రెండు బ్లాక్‌బస్టర్స్ ఇచ్చి యంగ్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తున్న నందమూరి బాలకృష్ణ ఈ సినిమాతో మరో సంచలనం సృష్టించడం ఖాయమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.