English | Telugu
మళ్ళీ సీన్ రిపీట్ చేస్తున్న గోపి,వాసు
Updated : Feb 20, 2014
గోపీచంద్ హీరోగా నటించిన "లక్ష్యం" సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శ్రీవాస్.. దర్శకుడిగా మంచి పేరును సంపాదించుకున్నాడు. అయితే వీరిద్దరి కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతుంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్లో నిర్మాత ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాత ఆనంద్ మాట్లాడుతూ..."శ్రీధర్ సీపాన ఇచ్చిన కథ గోపీచంద్ కి చక్కగా సరిపోతుంది. "శౌర్యం" తరువాత గోపీచంద్ ఆ స్థాయి యాక్షన్ ఎంటర్ టైనర్ చేయలేదు. ఆ లోటు ఈ సినిమాతో తీరుతుంది" అని అన్నారు. దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ... "గోపీచంద్ శైలికి సరిపోయే కథ ఇది. "లక్ష్యం" తరువాత మళ్ళీ గోపీచంద్టి కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది" అని అన్నారు. ఈ చిత్రానికి కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు.