English | Telugu
నేను సినిమా చెయ్యట్లేదు
Updated : Feb 20, 2014
ప్రముఖ దర్శకుడు పి.వాసు దర్శకత్వంలో ఐశ్వర్యరాయ్ ప్రధాన పాత్రలో "ఐశ్వర్య వెయ్యి కాకులు" అనే చిత్రం త్వరలోనే తెరకెక్కబోతున్నట్లుగా గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇవన్నీ పుకార్లే అని స్వయంగా ఐష్ తెలిపింది. ప్రస్తుతానికి నేనింకా ఏ సినిమా అంగీకరించలేదు. నా సినిమా విషయంపై వస్తున్న పుకార్లను నమ్మకండి. ఏదైనా ఉంటే నేనే స్వయంగా తెలియజేస్తాను. ప్రస్తుతానికి నేను కొన్ని కథలు వింటున్నాను. త్వరలోనే ఒక కథకు ఒకే చెప్పి మీ ముందుకు వస్తాను" అని తెలిపింది.