English | Telugu

వెంకీ దృశ్యం ప్రారంభం

మలయాళంలో మోహన్ లాల్, మీనా జంటగా నటించిన "దృశ్యం" చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. ఇందులో మోహన్ లాల్ పాత్రలో వెంకటేష్ నటిస్తున్నారు. ఈరోజు ఉదయం ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు జరిగాయి. తెలుగులో కూడా "దృశ్యం" అనే టైటిల్ ను ఖరారు చేసారు. వెంకీ సరసన మీనాని హీరోయిన్‌గా తీసుకున్నట్లు సమాచారం. ఇందులో నదియా పోలీసు ఆఫీసర్‌ పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. శ్రీప్రియ దర్శకత్వం వహించబోతుంది. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.