English | Telugu
నరేష్ క్యారవాన్ పై రాళ్ల దాడి.. ఆమె పనేనా?
Updated : Feb 20, 2023
కొంతకాలంగా సీనియర్ నటుడు నరేష్ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. నటి పవిత్రా లోకేష్ తో ఆయన నాలుగో పెళ్ళికి సిద్ధమవ్వడంతో.. మూడో భార్య రమ్య రఘుపతికి, ఆయనకు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా నరేష్ ఇంటిపై రాళ్ల దాడి జరగడం సంచలనంగా మారింది.
నరేష్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారంటూ ఆయన పీఏ హైదరాబాద్ లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నానక్ రామ్ గూడ విజయ టవర్స్ లోని ఆయన క్యారవాన్ పై దుండగులు రాళ్లు రువ్వాలని, ఈ దాడిలో క్యారవాన్ అద్దాలు ధ్వంసమైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ దాడి వెనక తన మాజీ భార్య రమ్య రఘుపతి హస్తం ఉందని నరేష్ ఆరోపిస్తున్నట్లు తెలుస్తోంది.