English | Telugu
అఖిల్ పై కన్నేసిన పోర్న్ స్టార్
Updated : Jan 27, 2014
సినీ క్రికెట్ లీగ్(సిసిఎల్)4 మ్యాచ్ ఇటీవలే ప్రారంభమయ్యింది. ఇందులో తెలుగు వారియర్స్ జట్టుకు అక్కినేని అఖిల్ వైస్ క్యాప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే అఖిల్ ఆట చూసిన ఒక పోర్న్ అందాల భామ అతగాడి మాయలో పడిపోయింది. ఇంతకి ఆ భామ ఎవరనుకుంటున్నారా? బాలీవుడ్ లో ప్రస్తుతం తన అందాలతో అలరిస్తున్న ఏకైక హాట్ బ్యూటీ సన్నీ లియోన్. సన్నీ ఇటీవలే అఖిల్ ఆట చూసి అతడిని పొగడ్తలతో ముంచెత్తుతుంది."సిసిఎల్ 4లో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన అఖిల్‌ని నేనెంతో అభిమానిస్తున్నాను. అతని ఆట తీరు నన్నెంతో ఆకట్టుకుంది. టాలీవుడ్ క్రికెట్ టీమ్‌కి తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని సన్నీ స్పష్టం చేసింది. మరి ఈ అమ్మడి మాటలు టాలీవుడ్ లో తన హవా చూపడానికేనా లేక నిజంగానే అఖిల్ కోసమే ఇలా పొగిడిందా అని అందరు గుసగుసలు పెడుతున్నారు.