English | Telugu
అల్లు అరవింద్ బాటలో దిల్ రాజు.. త్వరలో కొత్త ఓటీటీ ప్లాట్ ఫామ్!
Updated : Nov 2, 2023
కొంతకాలంగా ఓటీటీల హవా నడుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ కి చెందిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, 'ఆహా'తో ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన ప్రొడక్షన్ లో రూపొందే సినిమాలతో పాటు, ఇతర చిత్రాలు, డబ్బింగ్ సినిమాలు, షోలు ఆహాలో అలరిస్తున్నాయి. అయితే ఇప్పుడు అల్లు అరవింద్ బాటలో మరో ప్రముఖ నిర్మాత దిల్ రాజు పయనించబోతున్నట్లు తెలుస్తోంది.
డిస్ట్రిబ్యూటర్ గా, నిర్మాతగా టాలీవుడ్ లో దిల్ రాజుకి ఎంత పేరుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఎన్నో సినిమాలను ఆయన నిర్మిస్తుంటారు, పంపిణీ చేస్తుంటారు. అలాంటి దిల్ రాజు ఇప్పుడు ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారట. అంతేకాదు, ఓటీటీ కోసం రూ.5 కోట్ల లోపు బడ్జెట్ తో ఒకేసారి 25 సినిమాలను నిర్మించాలని ఆయన ప్లాన్ చేస్తున్నారట. దిల్ రాజు స్థాపించనున్న కొత్త ఓటీటీ వచ్చే ఏడాది అందుబాటులోకి వచ్చే అవకాశముంది అంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయట. దిల్ రాజు కొత్త ఓటీటీ ప్రారంభమైతే.. ఆయన నిర్మించే సినిమాలతో పాటు, డిస్ట్రిబ్యూట్ చేసే సినిమాలు కూడా అందులోనే విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా అల్లు అరవింద్, దిల్ రాజు వంటి నిర్మాతలు ఓటీటీలు స్థాపించడం అనేది అప్ కమింగ్ యాక్టర్స్, ఫిల్మ్ మేకర్స్ కి వరమని చెప్పొచ్చు.