English | Telugu

‘కాంతార’ కేసును రద్దు చేసిన హైకోర్టు.. వివాదానికి ఇదే కారణం!

కన్నడలో చిన్న సినిమాగా విడుదలై అనూహ్యంగా భారీ విజయాన్ని అందుకున్న సినిమా ‘కాంతార’. పలు భాషల్లో విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ సంచలన విజయం సాధించింది. అయితే ఈ సినిమా అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్‌ అవ్వలేదు. మొదట కన్నడలో విడుదలైన ఘనవిజయం సాధించిన తర్వాత మిగతా భాషల్లో విడుదల చేశారు. ఇంతటి సంచలన విజయం సాధించిన ఈ సినిమా ఓ వివాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. కాంతార సినిమాలో వరహా రూపం పాటపై వివాదం రేగింది. ఈ పాటపై కాపీరైట్‌ ఇష్యు వచ్చింది. వరాహ రూపం పాట ఒరిజినల్‌ ట్యూన్‌ మాది అని, తైక్కుడం బ్రిడ్జ్‌లోని నవసరం పాటకు కాపీ అని పాట హక్కులను కలిగి ఉన్న మాతృభూమి పబ్లిషర్స్‌ దావా వేశారు. వాద ప్రతివాదనలు విన్న కోర్టు దీనిపై విచారణ జరిపింది. చివరగా తన తీర్పును వెల్లడిస్తూ.. వరాహరూపం పాటను ఓటీటీ కాకుండా థియేటర్లలో లేదా డిజిటల్‌ మీడియాలో ఉపయోగించరాదని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు కేరళ హై కోర్టుకు వెళ్ళింది. దాంతో కాంతార టీమ్‌కి ఉపశమనం లభించింది.

వరాహ రూపం పాట గత కొంతకాలంగా కోర్టు చుట్టూ తిరుగుతూ వుండగా.. కాంతార టీమ్‌, మాతృభూమి పబ్లిషర్స్‌ మధ్య ఒక ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. కాంతార చిత్ర బృందం, మాతృభూమి పబ్లిషర్స్‌ మధ్య ఇటీవల చర్చలు జరిగాయి. వీరిరువురూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ చర్చల అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్ళి క్రిమినల్‌ ప్రొసీడిరగ్‌ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. వీరి పిటిషన్‌ను కోర్టు అంగీకరించింది. సెక్షన్‌ 482 కింద ప్రత్యేక అధికారాలను ఉపయోగించి కేసును రద్దు చేసింది. ఇది రెండు సంస్థల మధ్య ఉన్న ప్రైవేట్‌ వివాదంగా కనిపిస్తోందని, ఇలాంటి కేసులు గతంలో కూడా వచ్చాయని గుర్తు చేస్తూ ఈ కేసును రద్దు చేసింది కేరళ హైకోర్టు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.