English | Telugu

తమిళంలో "డేంజర్"

తమిళంలో "డేంజర్" సినిమా వెళ్ళనుంది. వివరాల్లోకి వెళితే అల్లరి నరేష్, సాయిరాం శంకర్, స్వాతి, షెరీన్ తదితరులు నటించగా, కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన విభిన్నకథా చిత్రం "డేంజర్". ఈ "డేంజర్" చిత్రాన్ని సాంప్రదాయ సిద్ధమైన లైటింగ్ వాడకుండా సహజ సిద్ధమైన వెలుతురులోనే దర్శకుడు కృష్ణ వంశీ చిత్రీకరించారు. ఇది అప్పట్లో ఒక సంచలనాత్మక ప్రయోగంగా చెప్పవచ్చు. ఈ "డేంజర్" చిత్రాన్ని ప్రస్తుతం తమిళంలోకి "అభయం" పేరుతో అనువదిస్తున్నారు.

ఇందుకు ఒక కారణముంది. ప్రస్తుతం అల్లరి నరేష్, స్వాతి తాము ఇటీవల నటించిన తమిళ చిత్రాలతో తమిళ ప్రేక్షకులకు బాగా పరిచయమయ్యారు. అమదుకని ఈ "డేంజర్" చిత్రాన్ని తమిళంలోకి "అభయం" పేరుతో అనువదిస్తున్నారు. ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలను తమిళ ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. అలాగే ఈ "డేంజర్" తమిళ వెర్షన్ "అభయం" చిత్రాన్ని కూడా ఆదరిస్తారని ఆశిద్దాం.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.