English | Telugu
నాగచైతన్యతో బన్నీ వాసు చిత్రం
Updated : Dec 31, 2011
నాగచైతన్యతో బన్నీ వాసు చిత్రం నిర్మించనున్నాడని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే నాగచైతన్య హీరోగా, తమన్నా హీరోయిన్ గా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన "100% లవ్" చిత్రం ద్వారా నిర్మాతగా మారిన బన్నీ వాసు మరో చిత్రానికి శ్రీకారం చుడుతున్నారని తెలిసింది. అయితే ఈ చిత్రంలో హీరోగా మళ్ళీ యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా నటిస్తాడని తెలిసింది. ఈ చిత్రానికి బన్నీ వాసుతో పాటు దిల్ రాజు కూడా మరో నిర్మాతగా వ్యవహరించనున్నాడని అంటున్నారు.
ఈ చిత్రానికి రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించనున్నారట. రవికుమార్ చౌదరి గతంలో "మనసుతో, యజ్ఞం, వీరభద్ర" వంటి చిత్రాలకు దర్శకత్వం వహించగా, "యజ్ఞం" మాత్రమే హిట్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం బహుశా రానున్న మార్చి నెలలో ప్రారంభం కావచ్చని సమాచారం.