English | Telugu
ఆ పొరపాటువల్ల చిరును ట్రోల్ చేస్తున్న యాంటీ ఫ్యాన్స్!
Updated : Nov 15, 2023
సినిమా డాన్సుల్లో కొత్త ఒరవడి తీసుకొచ్చిన హీరో మెగాస్టార్ చిరంజీవి. చిరు డాన్స్‌కి వీరాభిమానులు ఉన్నారు. ఈ వయసులోనూ స్టెప్స్ వేస్తూ అభిమానుల్ని అలరిస్తున్నారు. స్క్రీన్ మీదే కాదు, తెరవెనుక కూడా అంతే జోష్‌గా డాన్స్ చేస్తుంటారు. తాజాగా దీపావళి పార్టీలో చిరు కాసేపు డాన్స్ చేసి అలరించారు. షారుక్‌ఖాన్ జవాన్ సినిమాలోని పాటకు జోష్‌తో స్టెప్పులేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ వీడియో చివర్లో ర్యాపర్ రాజకుమారికి హగ్ ఇచ్చేటప్పుడు మాత్రం చిన్న పొరపాటు దొర్లింది. చిరు హ్యాండ్ తగలరాని చోట తగిలింది. దాన్నే ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు చిరంజీవి యాంటీ ఫాన్స్. బ్యాడ్ టచ్ అంటూ ఆ వీడియోలో బిట్ కచ్ చేసి వైరల్ చేస్తున్నారు. అది అనుకోకుండా జరిగిందే తప్ప కావాలని చేసింది కాదని చిరు ఫ్యాన్స్ సమాధానం చెబుతున్నారు.
రాజకుమారి హుషారుకు తగ్గట్లు అంతే జోష్‌తో చిరు డ్యాన్స్ చేశాడు. మరో ప్రక్క రామ్‌చరణ్ తండ్రిని ఎంకరేజ్ చేస్తూ కనిపించాడు. ఈ పార్టీ జరిగింది మెగాస్టార్ ఇంట్లోనే. తన మనవరాలు క్లీంకార పుట్టిన తర్వాత వచ్చిన తొలి దీపావళి పండగ కావడంతో ఎంతో ఘనంగా వేడుక నిర్వహించారు. ఈ పార్టీకి మహేశ్‌బాబు, వెంకటేశ్, ఎన్టీఆర్ తదితరులు హాజరైన విషయం తెలిసిందే.