English | Telugu

మెగా ప్యామిలీకి, మా ఫామిలీకి మధ్య గొడవైతే.. మీరెందుకు రచ్చ చేస్తున్నారు?

టాలీవుడ్‌లో డా. రాజశేఖర్‌కి ఓ స్పెసల్‌ ఇమేజ్‌ ఉంది. అలాగే రాజశేఖర్‌, జీవిత దంపతులకు ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఉంది. వీరి కుమార్తె శివాని టాలీవుడ్‌లో హీరోయిన్‌గా నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. హీరోయిన్‌గానే కాదు క్యారెక్టర్‌ ఇంపార్టెన్స్‌ని బట్టి స్పెసల్‌ క్యారెక్టర్లు కూడా చేసేందుకు సిద్ధపడుతోంది. లేటెస్ట్‌గా శివానీ చేస్తున్న సినిమా ‘కోట బొమ్మాళి పిఎస్‌’. ఈ సినిమా నవంబర్‌ 24న విడుదల కాబోతోంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్‌ ఊపందుకున్నాయి. శ్రీకాంత్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, శివానీ, రాహుల్‌ విజయ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఓ కొత్త కాన్సెప్ట్‌తో రూపొందింది. ఈ సినిమా శివానీ కెరీర్‌కి బాగా ప్లస్‌ అవుతుందని చిత్ర యూనిట్‌ చెబుతోంది.


ప్రమోషన్స్‌లో భాగంగా శివాజీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలపై మాట్లాడిరది. అందులో భాగంగానే రాజశేఖర్‌ కుటుంబానికి, మెగా ఫ్యామిలీకి మధ్య కొన్ని విభేధాలున్నాయని, వాటిపై స్పందించమని అడిగిన ప్రశ్నకు శివానీ సమాధానమిస్తూ... ‘లోపల బియ్యం గింజ అంత జరిగితే బయటకి బిర్యానీ అంత కనిపిస్తుంది. మీరు అడిగిన దాంట్లో నిజం ఉంది. పాలిటిక్స్‌ అన్న తర్వాత కొన్ని విభేదాలు రావడం సహజమే కదా. ఎన్ని విభేదాలు ఉన్నా సమయం వచ్చినపుడు అందరూ కలిసిపోతారు. ప్రొఫెషనల్‌గా వేరు, పర్సనల్‌గా వేరుగా ఉంటుంది. అయితే, ఆ వివాదాలన్నీ ఓ హీట్‌ మూమెంట్‌లో మాత్రమే జరిగాయి. మా మధ్య జరిగిన గొడవల గురించి బయటివాళ్ళు ఎందుకు గొడవ పడుతున్నారు? ఎందుకు ట్రోల్‌ చేస్తున్నారు? ఎప్పుడో జరిగిన చిన్న వివాదం వల్ల వాళ్ళ ప్రొడక్షన్‌లో నేను, మా ప్రొడక్షన్‌లో వాళ్ళు నటించకూడదని ఏమీ ఉండదు కదా’ అని చెప్పింది శివానీ. గీతా ఆర్ట్స్‌ బేనర్‌లోనే ‘కోట బొమ్మాళీ పిఎస్‌’ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే.