English | Telugu

అఖిల్ కి సర్జరీ..

అఖిల్ అక్కినేని...ఒక హీరో మెటీరియల్ కి కావలసిన అన్ని లక్షణాలు కలిగి ఉన్న ఒక మిస్సైల్. సాధారణంగా కొంత మంది హీరోలకి అందంగా హైట్ ఉండదు. హైట్ ఉంటే అందం ఉండదు. ఒక వేళ అందం,హైటు ఉంటే ముఖ వర్చస్సు ఉండదు. కానీ ఈ మూడు లక్షణాలని కలిగి ఉన్న హీరో అఖిల్. తాజాగా సోషల్ మీడియా లో అఖిల్ గురించి వస్తున్న ఒక వార్త అఖిల్ అభిమానులని కలవరపాటుకి గురి చేసింది.

అఖిల్ అక్కినేని నుంచి ఇప్పటి వరకు ఐదు సినిమాలు వచ్చాయి. ఆ ఐదు సినిమాలు అఖిల్ రేంజ్ కి తగట్టుగా ఆడకపోయినా ఆ సినిమాల్లో అఖిల్ నటనకి మంచి మార్కులు పడ్డాయి. లేటెస్ట్ గా వచ్చిన ఏజెంట్ మూవీ లో అఖిల్ నటన సూపర్ గా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే హాలీవుడ్ రేంజ్ హీరో లెవెల్లో అఖిల్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ఆ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు .సిక్స్ ప్యాక్ బాడీ ని మెయిన్ టైన్ చెయ్యడంతో పాటు తన లుక్ విషయంలో కూడా అఖిల్ చాలా కష్టపడ్డాడు. కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది .కానీ ఏజెంట్ సినిమా పక్కాగా పూర్తి స్క్రిప్ట్ తో రెడీ అయ్యి షూటింగ్ కి వెళ్లి ఉంటే సినిమా ఆడేదని చాలా మంది చెప్పారు.

ఇక అసలు విషయానికి వస్తే. అఖిల్ ఇప్పుడు తన ముక్కుకి చిన్న సర్జరీ లాంటిది చేయించుకోవడానికి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నాడు. మొదట అఖిల్ కి సర్జరీ ఏంటి అని అభిమానులు ఆందోళన చెందారు. కానీ ఆ తర్వాత ముక్కుకి చిన్న ఆపరేషన్ లాంటిది అని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు .సర్జరీ నుంచి రాగానే అఖిల్ తన కొత్త సినిమాని మొదలుపెడతాడు. ఒక్కటి మాత్రం పక్కాగా రాసిపెట్ట్టుకోండి .అఖిల్ తన తాత అక్కినేని నాగేశ్వరరావు, నాన్న అక్కినేని నాగార్జున ల కంటే మంచి నటుడు అన్నది ఎంత నిజమో తనదైన రోజున వాళ్ళిద్దరిని మించిన టాప్ స్టార్ స్టేటస్ ని అఖిల్ పొందటం కూడా అంతే నిజం.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.