English | Telugu

నయనతార కి సొంత వాళ్ళ నుంచి తలనొప్పులు.. బ్యాన్ చెయ్యాలనే డిమాండ్ 

నయనతార నటించిన తాజా చిత్రం అన్నపూరణి.. మొన్న డిసెంబర్ 1 న తమిళనాడులో విడుదలైన ఈ మూవీ విడుదలైన అన్నిచోట్ల పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకుపోతుంది. బ్రాహ్మణ యువతిగా నయన్ ఈ సినిమాలో అధ్బుతమైన ప్రదర్శనని కనపరిచింది. తాజాగా అన్నపూరణి నయనతార కి కొత్త తలనొప్పుల్ని తెచ్చింది.

ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన అన్నపూరణి అనే అమ్మాయికి చిన్నప్పటినుంచి ఇండియాలోనే బెస్ట్ చెఫ్ గా నిలవాలనే కోరిక ఉంటుంది. కానీ ఆమె కుటుంబ సభ్యులకి తను అలా అవ్వడం ఇష్టం ఉండదు. ఈ క్రమంలో అన్నపూరణి తన లక్ష్యాన్ని చేరుకుందా లేదా అనేదే అన్నపూరణి మూవీ కథ. టైటిల్ రోల్ పోషించిన నయనతార తన క్యారక్టర్ నిమిత్తం రకరక వంటకాల్ని చేస్తుంది. అలాగే ఒక ముస్లిం యువకుడిని ప్రేమిస్తుంది. ఇప్పుడు ఈ అంశాలే నయన్ కి తలనొప్పులు గా మారాయి. బ్రాహ్మణ సమాజాన్ని అన్నపూరణి చిత్రం అవమాన పరిచిందని వెంటనే సినిమాని బ్యాన్ చెయ్యాలని తమిళనాడు బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ఆలాగే బ్యాన్ చెయ్యకపోతే చిత్ర బృందం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా అంటున్నారు.

కాగా నయన్ తాజాగా అన్నపూరణి మూవీ విజయోత్సవంలో భాగంగా చెన్నైలో ఉన్న ప్రముఖ లేడీస్ కాలేజీని చిత్ర యూనిట్ తో కలిసి సందర్శించింది. లంచ్ టైం కి అక్కడకి వెళ్లిన నయన్ స్టూడెంట్స్ కోసం బిర్యానీ తయారు చెయ్యడమే కాకుండా స్వయంగా తన చేతులతో అందరికి బిర్యానీని వడ్డించింది. ఎప్పుడు తన మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొనని నయనతార అన్నపూరణి సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడం ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.