English | Telugu
నాని డైరెక్షన్ లో నాగార్జున సినిమా!
Updated : Dec 4, 2023
బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతుంది. నిన్నటి సండే ఎపిసోడ్ లో గెస్ట్ గా నాని వచ్చాడు. వచ్చీ రాగానే బిగ్ బాస్ సీజన్-2 గుర్తొంచ్చిందంటూ తన జ్ఞాపకాలని పంచుకున్నాడు. హోస్ట్ గా ఉన్నప్పుడు మన టీవీని .. మీ నా.. ని టీవీ అనేవాడినని నాగార్జునతో నాని చెప్పుకొచ్చాడు.
హోస్ట్ నాగార్జున ఏంటి ఇలా వచ్చావని అడుగగా.. మీ నాని హాయ్ నాన్నగా వచ్చానంటూ సమాధానమిచ్చాడు. ఇక ఆ తర్వాత హాయ్ నాన్న ట్రైలర్ చూపించాడు. ఎమోషనల్ గా ఉంది కదా.. పాప బాగా చేసినట్టటుందని నాగార్జున అనగా.. అవును సర్. తను చాలా ప్రాక్టీస్ చేసింది. చాలా నేచురల్ గా చేసిందని నాని అన్నాడు. ఈ సినిమాకి కొత్త డైరెక్టరా? అని నాగ్ అనగా.. అవును సర్.. మీ నుండి తీసుకున్నా.. నిన్నే పెళ్ళాడతా, శివ లాంటి సినిమాలకి మీరు కొత్త డైరెక్టర్ లకి ఛాన్స్ ఇచ్చారు. అదే ఇప్పుడు నేను ఫాలో అవుతున్నానని నాని అన్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా సినిమా కెరీర్ ని ప్రారంభించి ఇప్పుడు హీరోగా మెప్పిస్తున్నావ్. మరి నన్ను హీరోగా ఎప్పుడు చూపిస్తావ్ అని నాగార్జున అడుగగా.. సర్ మీరు ఎప్పుడు అంటే అప్పుడే స్టార్ట్ చేద్దాం.. మీరు డేట్స్ ఇవ్వాలి కానీ నేను రెడీ సర్ అని నాని అన్నాడు. అవునా అయితే త్వరలో చేసేద్దామని నాగార్జున అన్నాడు.
ఇక కథ ఎప్పుడు ఒకే అయితే అప్పుడే మీకు కాల్ చేస్తాను సర్ అని నాని అనగా.. ఒకే నేను రెడీ.. త్వరలోనే చేద్దామని నాగార్జున అన్నాడు. అయితే వీరిద్దరు కలిసి 'దేవదాస్' సినిమాలో నటించారు. మరి నాని డైరెక్షన్ లో సినిమా చేయడానికి నాగార్జున నిజంగానే డేట్స్ ఇస్తాడా? అసలు నాని కథ రెడీ చేస్తాడా? ఇవి రెండు జరిగితే వీరిద్దరి కాంబినేషన్ లో బొమ్మ బ్లాక్ బాస్టర్ అవుతుంది. మరి ఈ కాంబో వెండితెరపై ఎప్పుడు వస్తుందో చూడాలి. అయితే నిన్నటి ఎపిసోడ్ లో ఇదే హైలైట్ ఆఫ్ ది వీక్ గా నిలిచింది. నాని, నాగార్జునల కలయికలో ఈ హిట్ కాంబినేషన్ ఎప్పుడు వస్తుందో చూడాలి మరి.