English | Telugu
నోరు విప్పిన బోనీ కపూర్.. శ్రీదేవి మరణం గురించి సంచలన విషయాలు!
Updated : Oct 3, 2023
అతిలోక సుందరి శ్రీదేవి 2018లో దుబాయ్ లోని ఓ హోటల్ లో ప్రమాదవశాత్తూ బాత్ టబ్ లో మునిగి మరణించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో ఆమె మరణంపై పలువురు అనుమానం వ్యక్తం చేశారు. శ్రీదేవి మరణం గురించి ఆమె భర్త బోనీ కపూర్ ఏదో దాస్తున్నారని సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా శ్రీదేవి మరణంపై బోనీ కపూర్ స్పందించారు. అందం కోసం ఆమె పాటించిన ఆహారపు అలవాట్లే ఆమె మరణానికి కారణమని బోనీ కపూర్ తెలిపారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బోనీ కపూర్.. "అందంగా కనిపించడం కోసం శ్రీదేవి కఠినమైన డైట్ ఫాలో అయ్యేది. ఉప్పు లేని ఆహరం తీసుకునేది. దాని వల్ల కళ్ళు తిరిగి పడిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తనకు లో బీపీ ఉందని, ఆహార నియమాలు మార్చుకోవాలని వైద్యులు సూచించినా శ్రీదేవి సీరియస్ గా తీసుకోలేదు. ఆమెది సహజ మరణం కాదు.. ప్రమాదవశాత్తు మరణించింది. ఆమె మరణాంతరం దుబాయ్ పోలీసులు నన్ను ఏకంగా 24 గంటలు విచారించారు. ఇండియా మీడియా నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగానే నన్ను అన్ని విధాలుగా విచారిస్తున్నట్లు చెప్పారు. లై డిటెక్టర్ పరీక్షలు కూడా చేశారు. చివరికి శ్రీదేవి మరణంలో ఎలాంటి కుట్రకోణం లేదని తేల్చారు" అని శ్రీదేవి మరణం గురించి చెప్పుకొచ్చారు.