English | Telugu

చిన్మయి రిప్లై..డబ్బు ఇస్తాను వస్తావా? 

ఆమె పాట పాడిందంటే దేవతలకి మాత్రమే దక్కిన అమృతాన్ని తాను పొందిందా అనేలా ఆమె గొంతు ఉంటుంది. తన గొంతుని వెండి తెర మీద ఏ పాత్రకైనా అరువు ఇచ్చినా కూడా అమృతం పొందినట్లే ఉంటుంది. తన గొంతుతో ఒక నటిని ఓవర్ నైట్ టాప్ హీరోయిన్ గా చేసిన ఘనత కూడా ఆమె సొంతం. ఆమె గానం,మాట మాత్రమే కాదు ఆమె రూపం కూడా ఎంతో మధురంగా ఉంటుంది. అలాంటి ఆమె తాజాగా సోషల్ మీడియాలో ఒక వ్యక్తి గురించి చెప్పిన విషయం సంచలనం సృష్టిస్తుంది.

చిన్మయి శ్రీపాద...తెలుగు తో పాటు తమిళ ,మలయాళ ,కన్నడ .హిందీ భాషల్లో ఎన్నో అద్భుతమైన పాటలు పాడి తన కంటూ అశేష అభిమానులని సంపాదించుకుంది. నేటికీ చిన్మయి పాడిన పాటలని రిపీట్ గా వినే ఆడియన్స్ ఎంతో మంది ఉన్నారు. అలాగే తనకి ఉన్న ఇంకో స్పెషల్ ఏంటంటే తన గొంతుతో స్క్రీన్ మీద నటించే హీరోయిన్ కి డబ్బింగ్ చెప్తుంది. ఏ మాయ చేసావు సినిమా నుంచి సమంత నటించిన ఎన్నో సినిమాలకి చిన్మయి తన గొంతుని ఇచ్చింది. సమంత బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు చిన్మయి గొంతుని అందించి సమంత స్టార్ హీరోయిన్ అవ్వడం లో తన వంతు పాత్ర పోషించిందంటే అతిశయోక్తి కాదు. ఏ మాయ చేసావు లో నేను నీకంటే వయసులో పెద్ద దాన్ని అనే డైలాగ్ అయినా లావణ్య త్రిపాఠి కి అందాల రాక్షసి మూవీలో చెప్పిన నాకు త్వరగా పెళ్లి చెయ్యండి నాన్న అనే డైలాగ్ ని అయినా నేటికీ మర్చిపోని ప్రేక్షకులు లేరు.
అసలు విషయంలోకి వస్తే..చిన్మయి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ ఆడవాళ్ళ మీద జరిగే అన్యాయాలు,అరాచకాలు మీద ఎప్పటికప్పుడు మహిళల్లో అవెర్నెస్ ని కలిగిస్తుంటుంది. ఈ క్రమంలో సోషల్ మీడియా లోచిన్మయి తో ఒక వ్యక్తి మీరు ఆడవాళ్ళకి జరుగుతున్న అన్యాయాలపై నిలబటం చాలా గ్రేట్ అంటూ పరిచయం అయ్యాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి నాతో ఒక రాత్రి గడుపుతావా డబ్బులు నువ్వడిగినంత ఇస్తాను అని అన్నాడు .ఈ విషయాన్ని స్వయంగా చిన్మయి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించింది. పైగా అతను తనకి పెట్టిన ఆ అసభ్యకరమైన మెసేజ్ ని కూడా చిన్మయి పోస్ట్ చేసింది.పైగా అతనికి రిప్లై గా అతన్నిపెంచిన వాళ్ళు తప్పుడు వాళ్ళు అయ్యి ఉంటారని ఘాటైన వ్యాఖ్యలు కూడా చేసింది.ప్రస్తుతం చిన్మయి విషయం సోషల్ మీడియా లో సంచలనం సృష్టిస్తుంది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.