English | Telugu
ప్రముఖ నిర్మాత మృతి.. గొప్ప సినిమాని నిర్మించి, చివరికి డబ్బుల్లేక...
Updated : Oct 3, 2023
తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత విఏ దురై కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం అర్థరాత్రి చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
విక్రమ్, సూర్య ప్రధాన పాత్రల్లో బాల దర్శకత్వంలో రూపొందిన 'పితామగన్' చిత్రాన్ని విఏ దురై నిర్మించారు. ఈ సినిమా తెలుగులో 'శివపుత్రుడు' పేరుతో విడుదలైంది. ఈ చిత్రం ఘన విజయం సాధించడమే కాకుండా, విక్రమ్ కి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డుని తెచ్చిపెట్టింది. 'పితామగన్' లాంటి గొప్ప చిత్రాన్ని నిర్మించిన విఏ దురై.. ఆ తర్వాత పలు చిత్రాలను నిర్మించి ఆర్థికంగా నష్టపోయారు. చాలాకాలంగా చిత్ర నిర్మాణానికి దూరంగా ఉంటున్న ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కనీసం తన దగ్గర వైద్యం చేయించుకోవడానికి కూడా డబ్బుల్లేవని వీడియో ద్వారా తెలపడంతో.. సూర్య ఆయనకు సహాయం చేశారు.