English | Telugu
బీహార్ గ్యాంగ్ ఉచ్చులో రష్మిక మందన్నా
Updated : Nov 16, 2023
హీరోయిన్ రష్మిక డీప్ ఫేక్ వీడియో ఎంతగా సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. భారతీయచిత్ర సీమకి సంబంధించిన అందరు ఆ విషయం మీద తీవ్రంగానే స్పందించారు.సెంట్రల్ గవర్నమెంట్ కూడా రష్మిక వీడియో కేసు ని చాలా సీరియస్ గా తీసుకొని దర్యాప్తు మొదలుపెట్టింది. ఇప్పుడు ఈ ఫేక్ వీడియో కి సంబంధించి ఒక యువకుడ్ని అరెస్ట్ చేసారు.
రష్మిక ఫేక్ వీడియో కి సంబంధించి ఢిల్లీ పోలీసులు తాజాగా బీహార్ కి చెందిన ఒక యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడి వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. వీడియో ఆ యువకుడి అకౌంట్ నుంచే సోషల్ మీడియాలో షేర్ అయ్యింది. కాకపోతే ఆ యువకుడు కూడా వేరే ఒక సోషల్ మీడియా అకౌంట్ నుంచి డౌన్ లోడ్ చేసుకొని వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేసాడు. అసలు ఆ వీడియో ఫస్ట్ ఎక్కడ నుంచి వచ్చింది అనే దాని మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఫేక్ వీడియో ని కేంద్రం చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని దర్యాప్తు చేస్తుంది. ఢిల్లీ మహిళా పోలీస్ కమిషన్ లో కూడా రష్మిక కేసు ఫైల్ అయింది. ఇంకో సారి ఎవరు ఇలాంటి ఫేక్ వీడియోల బారిన పడకుండా చూడాలని పలువురు ప్రముఖులు కోరుతున్నారు. రష్మిక నటించిన తాజా హిందీ చిత్రం యానిమల్ డిసెంబర్ 1 న విడుదలకి సిద్ధం అవుతుంది.