English | Telugu

నాగార్జున తమకి ఇచ్చిన హామీ ని నెరవేర్చాలసిందే

టాలీవుడ్ అగ్రహీరోల్లో అక్కినేని నాగార్జున కూడా ఒకడు. కళ కి సంబంధించి ఎన్ని రకాల పాత్రలు ఉంటాయో అన్ని రకాల పాత్రల్లోను నటించి ప్రేక్షకుల చేత జేజేలు కొట్టించుకున్న కింగ్ అక్కినేని నాగార్జున. ఈ యువ సామ్రాట్ నుంచి సినిమా వస్తుందంటే చాలు కొన్ని లక్షల మంది అభిమానులు తెల్లవారుజాము నుంచే థియేటర్స్ దగ్గర క్యూ కడతారు.అంతగా నాగార్జున అభిమానగనాన్ని సంపాదించుకున్నాడు. తాజాగా నాగార్జున తమకి ఇచ్చిన హామీ ని నెరవేర్చాలని అభిమానులు అంటున్నారు.

నాగార్జున కొత్త మూవీ నా సామి రంగా ఈ సంక్రాంతికి వస్తుందని ఆ మూవీ టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేసినప్పుడే మేకర్స్ చెప్పారు. దాంతో నాగ్ అభిమానులు వచ్చే సంక్రాంతి మా నాగ్ దే అని ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే నాగార్జున చాలా సినిమాలు సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టాయి .పైగా నాగార్జున నుంచి చాలా సంవత్సరాల తర్వాత వస్తున్న ఊర మాస్ మూవీ కావడంతో అభిమానులు నా సామి రంగా కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడు నా సామి రంగా మూవీ సంక్రాంతికి వస్తుందా రాదా అనే అనుమానం లో అభిమానులు ఉన్నారు. ఎందుకంటే సంక్రాంతికి ఇంకా కొద్దీ సమయమే ఉంది. ఇప్పటి వరకు నా సామి రంగా టీం నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. పైగా సంక్రాంతికి వస్తాయని అనుకున్న కొన్ని సినిమాలు సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్నాయి. దీంతో నాగ్ అభిమానుల్లో ఆందోళన మొదలయ్యింది. నాగార్జున కల్పించుకొని నా సామి రంగా అప్ డేట్ ని ఇవ్వాలని అలాగే తమకి ఇచ్చిన హామీ ని కూడా నెరవేర్చాలని అభిమానులు కోరుకుంటున్నారు.

తెలుగు నాట ఎవరినైనా సంక్రాంతి పండుగ విశిష్టత ఏంటి అని అడిగితే అందరు టక్కున సినిమాలు అని చెప్తారు. అంతగా సినిమాకి సంక్రాంతికి అనుబంధం ఏర్పడింది.అలాగే తమ అభిమాన హీరో నటించిన సినిమా సంక్రాంతికి రావాలని అందరి హీరోల అభిమానులు కోరుకుంటారు.అలాగే నాగ్ అభిమానులు కూడా ఈ సంక్రాంతికి తమ అభిమాన హీరో ని స్క్రీన్ మీద చూడాలని ఆశపడుతున్నారు. ప్రముఖ డాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ దర్శకత్వం లో వస్తున్న నా సామి రంగ మూవీ మీద నాగ్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలే ఉన్నాయి.