English | Telugu
ఇండియా వరల్డ్ కప్ గెలవాలంటే అమితాబ్ మ్యాచ్ చూడకూడదు!
Updated : Nov 16, 2023
నవంబర్ 19న జరగనున్న వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం ఇండియన్ క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈరోజు ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ లో గెలిచిన టీం.. ఫైనల్ లో భారత్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ ని చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కొందరు మాత్రం విచిత్రంగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ ని ఫైనల్ మ్యాచ్ చూడొద్దని వేడుకుంటున్నారు.
బుధవారం జరిగిన మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బిగ్ బి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. "నేను చూడనప్పుడు మనం గెలుస్తాము" అని అమితాబ్ ట్వీట్ చేశాడు. దీంతో భారత క్రికెట్ అభిమానులు "ప్లీజ్ సార్ మీరు ఫైనల్ మ్యాచ్ చూడకండి" అని కామెంట్స్ పెడుతున్నారు. మరి అభిమానుల కోరిక మేరకు బిగ్ బి తన మ్యాచ్ సెంటిమెంట్ ని ఫాలో అవుతూ ఫైనల్ చూడకుండా ఉంటారేమో చూడాలి.