English | Telugu
‘నా సామిరంగ’.. కింగ్ నాగార్జున జాతర మొదలైంది!
Updated : Aug 29, 2023
'ఈసారి పండక్కి.. ‘నా సామిరంగ’ అంటూ ఓ కొత్త గెటప్‌లో హల్‌చల్ చేసేందుకు కింగ్ నాగార్జున వచ్చేశారు. ఇప్పటివరకు నాగార్జునను చూడని ఓ కొత్త గెటప్. మాసిన గడ్డం, చెదిరిన జుట్టు, మాసివ్‌గా కనిపించే లుంగీతో టోటల్ డిఫరెంట్‌గా ఆడియన్స్‌ని అలరించబోతున్నారు నాగార్జున. ఈమధ్యకాలంలో లెక్కకు మించిన రగ్‌డ్ రౌడీలతో హీరో యాక్షన్ సీక్వెన్స్‌లు ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తున్నాయి. ఇప్పుడు కింగ్ నాగార్జున ఆ తరహాలో ఓ కొత్త జోనర్‌లోకి ఎంటర్ అవుతున్నారు. గతంలోనూ మాస్ సినిమాలు చేసినప్పటికీ ఇంత హెవీ డోస్ ఉన్న మాస్ సినిమా నాగ్ చెయ్యలేదు. ఫస్ట్‌లుక్ గ్లింప్స్ చూస్తుంటేనే సినిమా ఫుల్ ఆఫ్ మాస్ అనిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే ఈ గ్లింప్స్ చివరలో ‘ఈసారి పండక్కి.. నా సామిరంగ’ అని చెప్పడం సినిమా ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేస్తుంది.
యం.యం.కీరవాణి కాంబినేషన్‌లో ఎన్నో మ్యూజికల్ హిట్ వచ్చాయి. దాదాపు ఆరు సంవత్సరాల గ్యాప్ తర్వాత నాగార్జున, కీరవాణి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్‌లో కీరవాణి మ్యూజిక్ సైతం కొత్తగా అనిపించింది. కొత్త డైరెక్టర్ విజయ్ బిన్ని.. నాగార్జునను కొత్త లుక్‌లో కనిపించేలా చెయ్యడంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు.
కింగ్ నాగార్జున ఎన్నో అద్భుతమైన ప్రేమకథా చిత్రాలు చేశారు, మాస్ సినిమాలు చేశారు, యాక్షన్ మూవీస్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే నాగార్జున అన్ని జోనర్స్‌ను టచ్ చేశారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో చేసినా, అర్బన్ బ్యాక్‌డ్రాప్ చేసినా తనకంటూ ఉన్న ప్రత్యేకమైన స్టైల్‌తో ఆడియన్స్‌ని ఆకట్టుకోవడం కింగ్ నాగార్జునకు వెన్నతో పెట్టిన విద్య. తొలి సినిమా ‘విక్రమ్’తో మొదలుకొని నిన్నటి ‘ది ఘోస్ట్’ వరకు కింగ్ టచ్ చెయ్యని జోనర్ లేదు. ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘శిరిడి సాయి’ వంటి భక్తి చిత్రాలతో సైతం ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. ప్రయోగాలు చెయ్యడంలో ఎప్పుడూ ముందుండే నాగార్జున ఈసారి ఓ కొత్త తరహా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటివరకు మనం చూడని ఓ కొత్త నాగార్జునను చూడబోతున్నామని గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది.