English | Telugu
అనంతపురానికి బాలయ్య.. మామూలుగా ఉండదు!
Updated : Dec 4, 2023
ఇటీవల 'భగవంత్ కేసరి'తో ఘన విజయాన్ని అందుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ తన తదుపరి సినిమాని బాబీ కొల్లి డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్ లో 109 సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఈ యాక్షన్ డ్రామా షూటింగ్ రీసెంట్ గా ప్రారంభమైంది. ఈ మూవీ తదుపరి షెడ్యూల్ అనంతపురంలో జరగనున్నట్లు తెలుస్తోంది.
'NBK 109'కి సంబంధించిన కీలక షెడ్యూల్ ని అనంతపురంలో ప్లాన్ చేశారట. డిసెంబర్ మూడో వారంలో ఈ షెడ్యూల్ స్టార్ట్ కానుందని సమాచారం. ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుందట. ముఖ్యంగా ఓ పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ ని ప్లాన్ చేస్తున్నారట. అది సినిమాకే హైలైట్ గా నిలవనుందని అంటున్నారు.
ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయట. ఈ మూవీ, ఇందులోని బాలయ్య గెటప్ అభిమానులకు, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయమని చెబుతున్నారు.