English | Telugu

'సింహం' సెట్స్ పైకి వచ్చింది

‘లెజెండ్‌’ తర్వాత సత్యదేవ్‌ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తోన్న సినిమాలో బాలకృష్ణ నటిస్తోన్న విషయం విదితమే. కొన్ని రోజుల క్రితం ఆ సినిమా యాక్షన్ సీన్ చిత్రీకరణ సందర్బంగా గాయపడ్డారు. ఆ తరువాత చికిత్స చేయించుకొని కోలుకున్న బాలయ్య, చేతికర్ర సాయంతో అసెంబ్లీకి కూడా హాజరయ్యారు. ఈ రోజు సత్యదేవ్‌ సినిమా షూటింగ్ లో బాలయ్య పాల్గొన్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ లో బాలకృష్ణ, ఎమ్ ఎస్ నారాయణ కాంబినేషన్ లో కామెడీ సీన్లు చిత్రీకరణ చేస్తున్నారు.ఓ పక్క ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తూనే, ఇంకోపక్క సినిమాలు చేస్తున్నారు బాలకృష్ణ.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.