English | Telugu

మెగాస్టార్ కి మెగాగిఫ్ట్

మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు కానుకగా ఆయన తనయుడు రామ్ చరణ్ తేజ కోటి 25 లక్షలు విలువ చేసే ల్యాండ్ క్రూజర్ విఎక్స్ వి8 మోడల్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇప్పుడు ఈ గిఫ్ట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తూ చిరు తన బర్త్ డేను ఫ్యామిలీ మెంబర్స్‌తో నేపాల్‌లో జరుపుకుంటున్నట్టు సమాచారం. అయితే మెగాస్టార్ వారసుడిగా రామ్ చరణ్ ఫ్యాన్స్ చెప్పట్టిన కార్యక్రమాలలో పాల్గొని తన బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. మెగా అభిమానులు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న 150వ సినిమా ఈ నెలలో స్టార్ట్ చేస్తామని.. ఈ మూవీ‌లో ఎలాంటి సందేశాలు ఉండవని పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్‌గా ఉంటుందని ప్రకటించారు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.