English | Telugu

‘అసలు’ మూవీ రివ్యూ

సినిమా పేరు: అసలు
తారాగణం: రవిబాబు, పూర్ణ, సూర్య, సత్య కృష్ణన్ తదితరులు
సినిమాటోగ్రఫీ: చరణ్ మాధవనేని
ఎడిటింగ్: సత్యనారాయణ బళ్లా
సంగీతం: ఎస్ ఎస్ రాజేశ్
రచన, నిర్మాత, దర్శకత్వ పర్యవేక్షణ: రవిబాబు
దర్శకత్వం : ఉదయ్, సురేష్
ఓటీటీ: ఈటీవీ విన్

కథ:
వందన(పూర్ణ) తన స్టూడెంట్స్ కొందరికి ఆన్లైన్ లో క్లాస్ లు చెప్తుంటుంది. ఇంతలో వందన(పూర్ణ) యొక్క ప్రొఫెసర్ సూర్య.. ఆ ఆన్లైన్ క్లాస్ లో యాడ్ అవుతాడు. అతను క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి. ఏం క్రైమ్ లోనైనా ఫోరెన్సిక్ టీం ఎంత ముఖ్యపాత్ర వహిస్తుందో ఆ ప్రొఫెసర్ వివరిస్తూ ఉంటాడు. ఇంతలో ఒక ముసుగు వేసుకున్న వ్యక్తి వచ్చి ఆ ప్రొఫెసర్ ని కత్తితో దారుణంగా పొడిచి పొడిచి చంపేస్తాడు. అది లైవ్ లో చూసిన స్టూడెంట్స్ అంతా షాక్ అవుతారు. వందన(పూర్ణ) ఏడ్చుకుంటూ వెంటనే ఆ ప్రొఫెసర్ ఇంటికి వస్తుంది. ఆ ప్రొఫెసర్ ని ఎవరు హత్య చేసారు? ఎందుకు చేసారు అనేది మిగిలిన కథ.

విశ్లేషణ:
క్రైమ్ ఇన్వెస్టిగేషన్ గురించి చెప్తున్న ఒక ప్రొఫెసర్ ని హత్య చేయడంతో సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. ఆ హంతకుడిని పట్టుకోవడానికి ఈ కేస్ ని సిబిఐకి అప్పగిస్తారు. సిబిఐ లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రంజిత్(రవిబాబు) క్లిష్టమైన కేసులను సాల్వ్ చేయడంలో దిట్ట. ముందుగా ఒక కేస్ ఇన్వెస్టిగేషన్ తో ఆ పాత్ర పరిచయమవుతుంది. రంజిత్ ఇన్వెస్టిగేషన్ చేసిన ఆ కేస్ ని చూస్తే ఎంత పర్ఫెక్ట్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తాడో తెలుస్తుంది.

ఆ తర్వాత ప్రొఫెసర్ హత్య కేసు విచారణలో భాగంగా వందన(పూర్ణ) ని కలిసి ప్రొఫెసర్ యొక్క మొత్తం సమాచారం తెలుసుకుంటాడు రంజిత్(రవిబాబు). అయితే ఈ క్రమంలో రంజిత్, ప్రొఫెసర్ ఇంటిముందున్న సిసిటీవిని చూస్తాడు. ఆ సీసీటీవిని చూడగా నలుగురు ఆ ప్రొఫెసర్ దగ్గరకి వచ్చినట్లుగా అందులో ఉంటుంది కానీ వెళ్ళింది రికార్డ్ అవదు. ఇది కాస్త ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది. ఇక అక్కడ నుండి రంజిత్ ఒక్కొక్కరిని పిలిచి ఇన్వెస్టిగేషన్ చేసిన తీరు.. క్రైమ్ ఎవరు చేసారు అని ఒక్కో క్లూని కనుక్కునే తీరు బాగుంటుంది. అయితే ఈ మూవీ కాస్త స్లోగా సాగుతుంది. రంజిత్ సాల్వ్ చేసిన మొదటి ఇన్వెస్టిగేషన్ కంటే కాస్త బోరింగ్ గా అనిపిస్తుంది.

ద్వితీయార్థంలో వచ్చే సీన్లు ఏవీ కూడా అంత ఇంట్రెస్ట్ గా అనిపించవు. ప్రతీదీ సాధారణ ప్రేక్షకుడికి అర్థం అయ్యేలా అనిపిస్తుంది. ఒకప్పుడు 'అమరావతి', 'అవును' లాంటి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలని తీసిన రవిబాబు.. అతని శిష్యులకు ఇలాంటి ఒక సినిమాని దగ్గరుండి తీయించడం నిరాశను మిగిల్చిందనే చెప్పాలి. కథలో ఎక్కడా కొత్తదనం కనిపించదు. రంజిత్ సాల్వ్ చేసిన మొదటి కేస్ లో ఉన్నంత ఇంట్రెస్టింగ్ గా అసలు మర్డర్ సాల్వ్ చేసేప్పుడు ఎక్కడా కూడా కనిపించదు. ఏదీ పెద్దగా కనెక్ట్ అవదు. అన్నీ ఎక్కడో చూసినట్లుగానే ఉంటుంది. ‌థ్రిల్లర్ మూవీస్ కి బిజిఎమ్ ప్లస్ పాయింట్ కానీ ఈ మూవీకి ఎస్ ఎస్ రాజేశ్ అందించిన బిజిఎమ్ పెద్దగా ప్రభావితం చూపలేకపోక తేలిపోయింది. అసలు ఉందా బిజిఎమ్ అనిపించేలా ఉంది. కథా, కథనం ఎక్కడా కూడా ఆసక్తిని రేకెత్తించేలా తీర్చిదిద్దలేకపోయారు మేకర్స్. కొన్ని సీన్లు అయితే ఏదో సీరియల్ ఎపిసోడ్స్ తీసినట్టుగా ఉంటాయి. నిర్మాణ విలువలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. అన్ని సీన్లు నెమ్మదిగా సాగాయి. ఎడిటర్ సత్యనారాయణ కొన్ని సీన్స్ ని ట్రిమ్ చేస్తే బాగుండేది. చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ పర్వాలేదు.

నటీనటుల పనితీరు:
వందనగా పూర్ణ తన పాత్రకి న్యాయం చేసింది. ఈ సినిమాకి ప్రొఫెసర్ పాత్రలో సూర్య చాలా కీలకం. ఆ పాత్రలో వచ్చే వేరియేషన్స్ ఆకట్టుకున్నాయి. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రంజిత్ గా రవిబాబు.. ఆ పాత్రలో ఒదిగిపోయాడనే చెప్పాలి. రవిబాబు ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్స్‌ అన్నీ కూడా బాగుంటాయి. ఇక మిగిలిన నటీనటుల వారి వారి పాత్రల్లో బాగా రాణించారు.

తెలుగువన్ పర్ స్పెక్టివ్:
సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులకు ఈ 'అసలు' సినిమా అసలు ఏముందనిపిస్తుంది. అలాంటి ఈ 'అసలు' సినిమాని సాధారణ ప్రేక్షకులు ఒక్కసారి చూడొచ్చు.

రేటింగ్: 2.5 / 5

✍🏻. దాసరి మల్లేశ్


టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.