English | Telugu

శ్రీలీల ది అసలు అందమే కాదు అంటున్న యూత్!

తెలుగు సినిమా రంగంలో ఎప్పుడు కూడా ప్రెజెంట్ క్రేజ్ ఉన్న హీరోయిన్లు ఒక నలుగురైనా ఉంటారు.ఇంకా గట్టిగా చెప్పాలంటే కనీసం ఇద్దరు అయినా ఉంటారు. కానీ ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో ఒకే ఒక్క హీరోయిన్ ఫుల్ డిమాండ్ తో ముందుకు దూసుకుపోతుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు శ్రీలీల. ఈ అమ్మడు క్రేజ్ ముందు ఏ హీరోయిన్ కూడా నిలబడలేక పోతుంది. చిన్న హీరో పెద్ద హీరో అనే తేడా లేకుండా అందరి హీరోల సినిమాల్లోను శ్రీలీలే హీరోయిన్. ఇలా సినిమాల్లో సంచలనం సృష్టిస్తున్న ఈ అమ్మడు కి చెందిన ఒక పిక్ సోషల్ మీడియా లో సంచలనం సృష్టిస్తుంది.

శ్రీలీల తాజాగా బ్లాక్ శారీ తో దిగిన ఒక పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక అంతే కుర్రోళ్ళకి కంటి నిండా నిద్ర కరువయ్యింది. లేలేత నడుము మడతలు లేకుండా ఒంపులు తిరిగి కనపడుతుంటే యూత్ మొత్తం ఆమె అందానికి దాసోహమంటుంది. అసలు శ్రీలీలది అందమే కాదు అందానికి మించిన అందం అని అంటున్నారు.తన అభిమానులని పలకరిస్తూ శ్రీలీల షేర్ చేసిన ఈ పిక్ ప్రస్తుతం నెట్టింట సెగలు పుట్టిస్తుంది.

మొన్న వచ్చిన బాలయ్య భగవంత్ కేసరి సినిమాతో హిట్ కొట్టిన ఈ అమ్మడు తాజాగా మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఆదికేశవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శ్రీలీల కి ఇప్పుడు చేతి నిండా సినిమాలు ఉన్నాయి. మహేష్ తో నటించిన గుంటూరు కారం విడుదలకి సిద్ధంగా ఉంది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు నితిన్ 32 వ సినిమాలోను శ్రీలీలే కధానాయిక.అలాగే జూనియర్, వీ .డి 12 ల తో పాటు త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో రాబోయే సినిమాలోను ఆమె నటించబోతుంది.ఇవే కాకుండా తన ఖాతాలో మరిన్ని అప్ కమింగ్ ప్రాజెక్ట్ లు ఉన్నాయి.శ్రీలీల హవా ఇప్పుడిప్పుడే తగ్గేలా లేదు అని సినీ పండితులు చెప్తున్నారు.


రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.