English | Telugu

అమితాబ్ బచ్చన్ తో మళ్ళీ శ్రీదేవి

కొన్ని కాంబినేషన్లు ఎన్నాళ్ళయినా వన్నెతరగవు. అలాంటిదే ఆలిండియా సూపర్ స్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్, లేడీ అమితాబ్ బచ్చన్ గా పేరుపడ్డ సీనియర్ హీరోయిన్ శ్రీదేవిల కాంబినేషన్ కూడా. గతంలో అమితాబ్ బచ్చన్, శ్రీదేవి కలసి "ఇంక్విలాబ్" మరియూ "ఖదాగవా" వంటి హిట్ చిత్రాల్లో నటించారు. అలాంటి అమితాబ్ బచ్చన్, శ్రీదేవి కలసి మళ్ళీ త్వరలో ఒక చిత్రంలో నటించబోతున్నారు. అమితాబ్ బచ్చన్ తో గతంలో "చీనీకం", "పా" వంటి అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆర్.బాల్కి దర్శకత్వంలో రాబోయే ఒక చిత్రంలో బిగ్ బి బచ్చన్, శ్రీదేవి కలసి నటించబోతున్నారు.

అలాగే బాల్కి భార్య గౌరీ షిండే దర్శకత్వం వహించబోయే చిత్రంలో కూడా శ్రీదేవి నటించటానికి అంగీకరించిందని సమాచారం. శ్రీదేవికి ఇప్పటికీ భారతదేశ వ్యాప్తంగా కొన్ని కోట్లమంది మందిఅభిమానులున్నారనటంలో అతిశయోక్తిలేదు. శ్రీదేవి సినిమాల్లో నటించి దగ్గర దగ్గర రెండు దశాబ్దాలు కావస్తూంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.