English | Telugu

డెహరాడూన్ లో"రోబో" శంకర్ "3 ఇడియట్స్"

జెమిని ఫిలిం సర్క్యుట్స్ పతాకంపై, విజయ్, జీవా, శ్రీకాంత్ (తమిళ హీరో) హీరోలుగా, క్రియెటీవ్ డైరెక్టర్ "రోబో" శంకర్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో పునర్నిర్మించబడుతున్న చిత్రం "3 ఇడియట్స్". హిందీ "3 ఇడియట్స్" ఎక్కడెక్కడ చిత్రీకరించారో ఆయా లోకెషన్లలోనే ఈ "3 ఇడియట్స్" చిత్రాన్ని కూడా దర్శకుడు శంకర్ చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం డెహ్రాడూన్ లో ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ షుటింగ్ ని దర్శకుడు శంకర్ ప్లాన్ చేశారు. మార్చ్ ఆరవ తేదీ నుండి హీరోయిన్ ఇలియానా కూడా ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొంటుంది.

ఈ చిత్రం తమిళ వెర్షన్ కు "నన్బన్" అన్న పేరుని దర్శకుడు శంకర్ నిర్ణయించారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు హేరీస్ జైరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. దర్శకుడు శంకర్ రిక్వెస్ట్ వల్ల ఆయన హిందీ "3 ఇడియట్స్" చిత్రంలోని ట్యూన్లను కాపీ కొట్టకుండా అన్నీ ఫ్రెష్ ట్యూన్లతో ఈ చిత్రంలోని పాటలను కంపోజ్‍ చేస్తున్నారని తెలిసింది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.