English | Telugu

నందమూరి బాలకృష్ణ సరసన సలోని

ప్రముఖ హీరోయిన్ సలోని ఆ మధ్య రాజమౌళి దర్శకత్వంలో, సునీల్ హీరోగా నటించిన "మర్యాదరామన్న" చిత్రంలో హీరోయిన్ గా నటించింది. కానీ సలోనీకి ఆ తర్వాత రావలసినంత గుర్తింపు రాలేదు, అలాగే రావలసినన్ని సినిమాలు రాలేదు. అని సలోనీ బాధపడుతూండగా తంతే గారెల బుట్టలో పడ్డట్టుగా, ఊహించని చక్కని అవకాశం సలోనీకి దక్కింది. అదేంటంటే సలోనీకి ఏకంగా యువరత్న నందమూరి బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం లభించింది.

నందమూరి బాలకృష్ణ హీరోగా పరుచూరి మురళి దర్శకత్వంలో, యమ్ యల్ కుమార్ చౌదరి నిర్మిస్తున్న చిత్రంలో సలోనీకి హీరోయిన్ గా అవకాశం దక్కింది. ఇందులో సలోనీ పాత్ర మాంచి కిక్కిచ్చేటువంటి మాస్ మసాలాతో ఉండేలాంటి పాత్ర లభించిందట. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ సరసన నటించే పాత్ర తనకు మంచి పేరు తెస్తుందని సలోనీ భావిస్తూంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.