English | Telugu
షూటింగ్‌లో అల్లు అర్జున్‌కు అస్వస్థత.. ‘పుష్ప2’ షెడ్యూల్ వాయిదా!
Updated : Dec 2, 2023
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘పుష్ప2’ చిత్రం షూటింగ్ డిసెంబర్ రెండో వారానికి వాయిదా పడిరది. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్రంలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలతోపాటు ఒక పాట కూడా చిత్రీకరించారు. ఆ సమయంలో అల్లు అర్జున్‌కి తీవ్రమైన వెన్ను నొప్పి రావడంతో ప్రస్తుత షెడ్యూల్‌ను డిసెంబర్ రెండోవారానికి వాయిదా వేశారు.
ఈ షెడ్యూల్‌లోనే సినిమాలో ఎంతో కీలకమైన జాతర సన్నివేశాలు, కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు, పాట చిత్రీకరించాల్సి ఉంది. అందులో భాగంగానే జరిగిన షూటింగ్‌లో బన్ని అస్వస్థతకు గురి కావడంతో చిత్ర యూనిట్ షెడ్యూల్‌ను వాయిదా వెయ్యాలనే నిర్ణయం తీసుకుంది.
అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలోనే కాదు, ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు వున్నాయి. బన్నికి అస్వస్థత అని వస్తున్న వార్తలకు బన్ని అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.